విగ్రహావిష్కరణ చిచ్చు: ఖమ్మం జిల్లాలో కత్తులు దూస్తోన్న టీఆర్ఎస్ నేతలు, అధిష్టానం వద్దకు పంచాయితీ

ఖమ్మం జిల్లాలో (khammam district) జరిగిన ఓ విగ్రహావిష్కరణ అధికారపక్షం నేతల మధ్య వివాదానికి ఆజ్యం పోసింది. టీఆర్ఎస్ (trs) పార్టీలోని రెండు వర్గాలు బాహా బాహికి గత రాత్రి దిగగా.. ఆ దాడుల ప్రకంపనలు కొనసాగుతూనే వున్నాయి

ex mp ponguleti srinivas reddy vs mla rega kantharao in khammam district

ఖమ్మం జిల్లాలో (khammam district) జరిగిన ఓ విగ్రహావిష్కరణ అధికారపక్షం నేతల మధ్య వివాదానికి ఆజ్యం పోసింది. టీఆర్ఎస్ (trs) పార్టీలోని రెండు వర్గాలు బాహా బాహికి గత రాత్రి దిగగా.. ఆ దాడుల ప్రకంపనలు కొనసాగుతూనే వున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో (telangana movement) ద్రోహం చేసిన వ్యక్తి రేగా అంటూ మాజీ ఎంఎల్ఎ పాయం ఆరోపిస్తుండగా పొంగులేటి (ponguleti srinivas reddy) పార్టీ బయటకు వెళ్లి పర్యటనలు చేయాలని రేగా కాంతారావు (rega kantha rao) వ్యాఖ్యానించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (bhadradri kothagudem) అశ్వాపురం మండలం మల్లెల మడుగులో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్బంగా జరిగిన ఘర్షణలు టీఆర్ఎస్ పార్టీలో అయోమయానికి తావిస్తున్నాయి. అశ్వాపురం మండలంలో అంబేద్కర్ విగ్రహాన్ని గత రాత్రి ఆవిష్కరించడానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ ఎంఎల్ఎ పాయం వెంకటేశ్వర రావు తో (payam venkateswarlu) పాటుగా మాజీ ఎస్ సి కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి (pidamarthi ravi), డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్యలు వచ్చారు. అయితే వారు వస్తున్న విషయానికి సంబంధించి తమకు సమాచారం ఇవ్వలేదని ఎంఎల్ఎ , విప్ , టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు గుర్రుగా ఉన్నారు.

ప్రోటోకాల్ ప్రకారం తనకు చెప్పలేదని ఆగ్రహంతో ఉన్న రేగా మండలంలో 144 సెక్షన్ ను విధించేలా చేశారు. అయితే పొంగులేటి బృందం మల్లెల మడుగు గ్రామానికి రాకుండా అడ్డుకున్నారు. అయితే పిడమర్తి రవి ఉద్యమ కాలంలో చేసినట్లుగానే మోటార్ బైక్ పై పోలీసుల కళ్లు గప్పి వెళ్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో రాళ్ల దాడితో పొంగులేటి వర్గానికి చెందిన వారు ఇద్దరు గాయపడ్డారు. దీంతో పోలీసులు పొంగులేటి వర్గానికి చెందిన పిడమర్తి రవిపై కేసులు నమోదు చేశారు.

అయితే.. ఈ వ్యవహారం టీఆర్ఎస్ నేతలకు ఇబ్బందికరంగా మారింది. పొంగులేటి వర్గాన్ని దెబ్బ తీయడం కోసం దీనిని వినియోగించుకోవాలని చూస్తున్నారు. రేగా కాంతారావు ఇది అవకాశంగా తీసుకుని పొంగులేటిని పార్టీ నుంచి బయటకు పంపాలని ఎత్తుగడలు వేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. పొంగులేటి‌పై రేగా కాంతారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పొంగులేటి పార్టీని వదలిపెట్టి, వేరే పార్టీలో చేరి పర్యటనలు చేపట్టాలని అంటున్నారు. అంతేకాదు ఈ దాడి అంతా అగ్రవర్ణాలు చేసినట్లుగానే ఉందని, ఆర్ఎస్ఎస్ ఎలాంటి దాడులు చేస్తుందో అదే తరహాలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి దాడులు చేస్తున్నట్లుగా ఉందన్నారు రేగా . ఈ వ్యవహారాలపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ఫిర్యాదు చేసి వారిని పార్టీ నుంచి పంపించే చర్యలను తీసుకుంటామని అంటున్నారు.

అటు.. రేగా కాంతారావుపై మాజీ ఎంఎల్ఎ పాయం వెంకటేశ్వర రావు కూడా మండిపడుతున్నారు. రేగా కాంతారావు కాంగ్రెస్ నుంచి గెలుపొంది ఆ పార్టీ నుంచి వచ్చిన పదవికి రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ లో చేరారని ఆరోపించారు. తమ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. మరోవైపు పినపాక నియోజకవర్గంలో టిఆర్ఎస్ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. ఇటు పొంగులేటి వర్గానికి చెందిన పాయం వెంకటేశ్వర్లను రాజకీయాలకు దూరం చేయాలని రేగా కాంతారావు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈనేపథ్యంలో పాయంకు మద్దతు ఇస్తున్న పొంగులేటిపై కూడా విరుచుకుపడుతున్నారు. అటు రేగా కాంతారావు ఇటు పొంగులేటి వర్గీయులు ఇద్దరూ వ్యవహారాన్ని కేసీఆర్, కేటీఆర్ వద్ద తేల్చుకుంటామని అంటున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios