మండుటెండల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సరికొత్త ఆవిష్కరణను తీసుకొచ్చారు. 

వేసవిలో ఎండల తీవ్రతతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడి గాలులు కూడా బలంగా వీచాయి. ఇలాంటి పరిస్థితులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మండుటెండల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సరికొత్త ఆవిష్కరణను తీసుకొచ్చారు. ‘‘నీడ’’ అనే ఆవిష్కరణ చేవెళ్ల పార్లమెంట్‌లో గొప్ప విజయం సాధించిందని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 

వేసవికాలంలో పొలాల్లో పనిచేసే మహిళలు, వీధి వ్యాపారలు, గొర్రెల కాపరులు.. ఎండలో పనిచేయడం చాలా కష్టంతో కూడుకున్నదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి గుర్తుచేశారు. నీడ అనే పేరుతో రూపొందించిన పరికారాలు.. వేసవిలో చాలా బాగా పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ ఆవిష్కరణ పార్లమెంట్‌లో గొప్ప విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. ‘‘నీడ’’ అనేది ధరించగలిగిన హెడ్ గేర్.. ఇది గొడుగులా కాకుండా రెండు చేతులను పని చేయడానికి వీలు లేకుండా నీడను అందిస్తుందని చెప్పారు. వారు పని చేయడానికి కిందకు వంగి ఉన్నప్పుడు.. ఇది వారి వీపును కూడా ఎండ నుంచి రక్షిస్తుందని తెలిపారు. 

Scroll to load tweet…

ఓ ఆలోచనను ప్రాక్టికల్ వర్కింగ్ మోడల్‌గా మార్చడానికి 25 కంటే ఎక్కువ ప్రోటోటైప్‌లు పట్టిందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. దీన్ని అభివృద్ధి చేయడానికి 2 నెలలు పట్టిందని అన్నారు. తాను ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్నప్పటికీ.. జూమ్ ద్వారా వర్క్ చేస్తున్నామని చెప్పారు. తాము ఇప్పుడే పంపిణీ చేయడం ప్రారంభించినట్టుగా తెలిపారు. అయితే వేసవి దాదాపు ముగిసిందన్నారు. 

తేలికపాటి చినుకుల్లో కూడా దీనిని ఉపయోగించవచ్చని తెలిపారు. అయితే ఇది వర్షాల నుంచి రక్షించడానికి ఉద్దేశించబడలేదని చెప్పారు. గాలులు బలంగా వీస్తున్న సమయంలో దానిని చేతులతో పట్టుకోవచ్చని చెప్పారు. ట్రాక్టర్ డ్రైవర్లు, ఎద్దుల బండి నడిపేవారు, మున్సిపల్ కార్మికులు, పొలాల్లో పనిచేసే మహిళలు.. తమ నీడ పరికరాలను ఇష్టపడుతున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆయన షేర్ చేశారు. 

నీడ.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి షేర్ చేసిన ఫొటోలను గమనిస్తే ఆ పరికరాలు మనిషి తలకు అమర్చుతారు. అది తలతో పాటు, వెన్ను భాగాన్ని కవర్ చేసేలా ఉంది. అది తలకు గట్టిగా ఫిక్స్ అయి ఉండటం వల్ల దానిని ప్రత్యేకంగా పట్టుకోవాల్సిన అవసరం లేదు.