Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ వన్ మ్యాన్ రూల్ ని అడ్డుకోవాలి, లేకపోతే ప్రమాదం: మాజీ ఎంపీ వివేక్ ఫైర్

హైదరాబాద్ లో టీజేఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇంటర్ ఫలితాలు, దోషులు-మార్గాలు అనే అంశంపై నిర్వహించిన రౌంట్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని విమర్శించారు. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న గ్లోబరీన్ సంస్థకు కాంట్రాక్ట్‌ ఇవ్వడం దారుణమని అభిప్రాయపడ్డారు. 

ex mp g.vivek comments on cm kcr over inter results
Author
Hyderabad, First Published Apr 26, 2019, 3:52 PM IST

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ ఎంపీ వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు 23 మంది విద్యార్థుల ప్రాణాలను బలితీసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

హైదరాబాద్ లో టీజేఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇంటర్ ఫలితాలు, దోషులు-మార్గాలు అనే అంశంపై నిర్వహించిన రౌంట్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని విమర్శించారు. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న గ్లోబరీన్ సంస్థకు కాంట్రాక్ట్‌ ఇవ్వడం దారుణమని అభిప్రాయపడ్డారు. 

ఇంటర్ ఫలితాలు, విద్యార్థుల మరణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ వన్ మ్యాన్ రూల్ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను అడ్డుకోకపోతే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. 

టీజేఏసీ అధ్యక్షుడిగా ప్రొ.కోదండరామ్ అందర్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చి సకల జనుల సమ్మెతో తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చాటారని గుర్తు చేశారు. ప్రస్తుత తరుణంలో కోదండరామ్ అందర్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చి మరో ఉద్యమం చెయ్యాల్సిన అవసరం ఏర్పడిందని మాజీఎంపీ వివేక్ అభిప్రాయపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios