అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కుమార్తె దీపిక కారు ప్రమాదానికి గురైంది. శుక్రవారం ఉదయం ఆమె ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ అయ్యింది. మణికొండలోని  ఇంటి నుండి కాలేజీ కి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

యినబాద్ మండలం హజీజ్ పూర్ గ్రామాన్నీ దాటుతున్న సమయంలో అకస్మాత్తుగా ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి కుడివైపు డివైడర్ ఎక్కి రోడ్డు దాటుకుంటూ చెట్టును కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డ దీపిక..ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కారు మాత్రం నుజ్జు నుజ్జుగా మారింది.