Raghunandan Rao:  'కేసీఆర్ పులి కాదు .. ఎలుక'

Raghunandan Rao: మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలకు మాజీ ఎమ్మెల్యే , బీజేపీ నాయకులు రఘునందన్ రావు ఓపెన్ చాలెంజ్ విసిరారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబంలోని నేతలు పోటీ చేసి.. ఒక్క సీటు అయినా తెచ్చుకోవాలని ఓపెన్ చాలెంజ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ను  కేటీఆర్ పులి అంటున్నారు. పులి జనాల్లో ఎందుకు ఉంటుంది. అడవీలో ఉంటుందనే విషయం కేటీఆర్ తెలుసుకోవాలని సెటైర్లు వేశారు. కేసీఆర్ పులికాదు, పిల్లి అంతకన్నా కాదు ఎలుక అని రఘునందన్ ఎద్దేవా చేశారు. 

EX MLA Raghunandan Rao Satires On BRS Party And KCR KRJ

Raghunandan Rao: మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలకు మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఓపెన్ చాలెంజ్ విసిరారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం పోటీ చేసి గెలిచే దమ్ముందా? అని  ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ను బీఆర్ఎస్ గా పేరు మార్చినప్పుడే.. తెలంగాణతో ఆ పార్టీకి పేగుబంధం తెగిపోయిందని అన్నారు. హరీష్ రావు రాజకీయాల్లోకి రాకముందే(1999) మెదక్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ గెలుచుకుందని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే  లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని, అయితే.. లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్‌, కవిత, హరీష్, సంతోష్.. అయిదుగురు పోటీ చేయాలని సవాల్ విసిరారు. వారిలో ఎవరు పోటీ చేసినా.. గెలవరని, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే హుస్సేన్‌ సాగర్‌లో వేసినట్లేనని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి మరోసారి తెలంగాణ సమాజం కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉందని విమర్శించారు.
 
కేసీఆర్‌ను కేటీఆర్ పులి అంటున్నారు. పులి జనాల్లో ఎందుకు ఉంటుంది. అడవిలో ఉంటుందనే విషయం కేటీఆర్ తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. అసలు కేసీఆర్ పులి కాదనీ.. పిల్లి అంతకన్నా కాదు.. ఎలుక అంటూ ఎద్దేవా చేశారు. బయటకు వచ్చేది పులి కాదు.. కలుగులోకి వెళ్లాల్సిన ఎలుక అంటూ కేసీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  

గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్లు అమ్ముకుందనీ, పార్టీ కోసం పనిచేసిన వారికి సీట్లు ఇవ్వకుండా.. ఎవరూ సూట్ కేసులు ఇచ్చారో వారికి మాత్రమే పార్టీ టికెట్లు ఇచ్చిందనీ,  ఆ పార్టీ నాయకులు అమ్ముకుంటున్నారని  విమర్శలు గుప్పించారు. ఎర్రోళ్ల శ్రీనివాస్, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ లాంటి వాళ్లకు సీటు ఇవ్వగలరా? అని సవాల్ విసిరారు. బీజేపీ యేతర ముఖ్యమంత్రులు ప్రధానిని కలిసి నిధులు తెచ్చుకున్నారనీ, తెలంగాణ ప్రయోజనాల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిశారని గుర్తుచేశారు. గతంలో సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు.. ప్రధాని మోదీ తెలంగాణ వస్తే..కేసీఆర్ తన మొహం చాటేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios