బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారనున్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారనే వార్తలు వెలువడుతున్నాయి. 

బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారనున్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ మార్పు వార్తలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌లో చేరాలనే ఒత్తిడి ఉందని చెప్పారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే తన భవిష్యత్ నిర్ణయం ఉంటుందని అన్నారు. ఈ దసరాతోనే కేసీఆర్ రాక్షస పాలనకు స్వస్తి పలుకుదామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌లో చేరికపై నిర్ణయం తీసుకోలేదని అన్నారు. 

సీఎం కేసీఆర్ దుర్మార్గ పాలన విముక్తి కోసమే తన పోరాటం అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తనపై ఎంత దుష్ప్రచారం చేసినా కేసీఆర్‌పై పోరాటం ఆపనని పేర్కొన్నారు. ఇక, కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి చేరిక ఉంటుందా? లేదా? అనేది ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.