తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బాబు మోహన్ సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ తెలంగాణకు పట్టిన చీడ పురుగంటూ విమర్శలు చేశారు. బుధవారం జోగిపేట హౌసింగ్‌ బోర్డు కాలనీలో బీజేపీ కార్యాలయాన్ని బాబుమోహన్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ దళితుల్ని అవమానపరుస్తున్నారని, దళితుడే ముఖ్యమంత్రి అని ప్రకటించిన కేసీఆర్ నలుగురు దళితులను మోసం చేశాడని ఆరోపించారు. కేసీఆర్‌ను దళిత వ్యతిరేకిగా అభివర్ణించారు.

బీజేపీకి దళితున్ని పార్టీ అధ్యక్షుడిగా, రాష్టపతిగా అవకాశం కల్పించిన ఘనత ఉందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నాయకులు సూది, దారం, చెక్కర అంటూ దర్జీల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని అన్నారు. మంచి మహా మహా రాజులకు బట్టలు కుట్టిన చరిత్ర దర్జీలదని పేర్కొన్నారు. బీజేపీ జెండా అందోల్ నియోజకవర్గంలో ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మందుకు డబ్బుకు బీజేపీ దూరంగా ఉంటుందని తెలిపారు.