మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డిలు బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. బండి సంజయ్‌ని తప్పించిన తర్వాత తీవ్ర నైరాశ్యంలో వున్న కాషాయ శ్రేణులకు ఈ వార్త జోష్‌ నింపుతుందని చెప్పవచ్చు. 

మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డిలు బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, డీకే అరుణలను కలిశారు ఆకుల రాజేందర్, రంగారెడ్డి. వీరితో పాటు మాజీ డీసీసీబీ ఛైర్మన్‌లు జైపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డిలు కూడా బీజేపీలో చేరనున్నారు. వీరంతా త్వరలో కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత చేరికలు జరగడం ఇదే తొలిసారి. బండి సంజయ్‌ని తప్పించిన తర్వాత తీవ్ర నైరాశ్యంలో వున్న కాషాయ శ్రేణులకు ఈ వార్త జోష్‌ నింపుతుందని చెప్పవచ్చు.