తెలంగాణ లో ముందస్తు ఎన్నికల కోసం ముందస్తుగానే రాజకీయ క్రీడ మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్దమైన విషయం తెలిసిందే. దీంతో ఒక్కరోజులోనే రాజకీయ సమీకరణలు వేగవంతంగా మారాయి. వివిధ పార్టీల్లో అసంతృప్తులు పార్టీ పిరాయింపులకు సిద్దమయ్యారు. ఇలా టిడిపి పార్టీలో వున్న ఓ మాజీ మంత్రి, సీనియర్ నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోడానికి సిద్దమయ్యారు.
తెలంగాణ లో ముందస్తు ఎన్నికల కోసం ముందస్తుగానే రాజకీయ క్రీడ మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన విషయం తెలిసిందే. దీంతో ఒక్కరోజులోనే రాజకీయ సమీకరణలు వేగవంతంగా మారాయి. వివిధ పార్టీల్లో అసంతృప్తులు పార్టీ పిరాయింపులకు సిద్దమయ్యారు. ఇలా టిడిపి పార్టీలో వున్న ఓ మాజీ మంత్రి, సీనియర్ నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోడానికి సిద్దమయ్యారు.
గద్వాల నియోజకవర్గంలో డికె కుటుంబానికి రాజకీయ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. నియోజకవర్గంలో ఈ కుటుంబం నుండే అత్యధికులు శాసనసభకు ఎన్నికయ్యారు. గతంలో డికె సమరసింహా రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి గద్వాల ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. అయితే గత ఎన్నికలకు ముందు ఇతడు టిడిపి పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా టిడిపి నియోజకవర్గ ఇంచార్జిగా వున్న సమరసింహా రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. ఇవాళ సాయంత్రం సమరసింహా రెడ్డి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి కుంతియా సమక్షంలో కండువా కప్పుకోనున్నారు.
అయితే డికె వర్గంలో ఈ చేరిక వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ లో ప్రస్తుతం కీలక నేతగా వున్న డికె. అరుణకు సమరసింహారెడ్డి స్వయానా బావ. ఒకే కుటుంబం అయినప్పటికి వీరిద్దరి మధ్య రాజకీయ వైరం వున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో సమరసింహారెడ్డి కాంగ్రెస్ లో చేరనుండడం గద్వాల రాజకీయాల్లో ప్రత్యేకతను సంతరించుకుంది.
సమరసింహా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనీయకుండా తాను అడ్డుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని డికె. అరుణ స్పష్టం చేశారు. పార్టీకి లాభం జరుగుతుందంటే పార్టీలోకి ఎవరు వచ్చినా సమ్మతమే అన్నారు. సమరసింహా రెడ్డి సేవల్ని పార్టీ ఎలాగైనా ఉపయోగించుకోవచ్చని అన్నారు. ఇవాళ సాయంత్రం ఆయన చేరనున్నట్లు తనకు కూడా సమాచారం ఉందని అరుణ తెలిపారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Sep 9, 2018, 2:12 PM IST