Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత.. కేసీఆర్ సంతాపం

మాజీ మంత్రి, టీఆర్ఎస్ (trs) నేత మహమ్మద్‌ ఫరీదుద్దీన్‌ (mohammed fareeduddin) కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు

ex minister mohammed fareeduddin passes away
Author
Hyderabad, First Published Dec 29, 2021, 9:59 PM IST

మాజీ మంత్రి, టీఆర్ఎస్ (trs) నేత మహమ్మద్‌ ఫరీదుద్దీన్‌ (mohammed fareeduddin) కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఫరీదుద్దీన్‌ మృతిపట్ల సీఎం కేసీఆర్‌ (cm kcr) సంతాపం వ్యక్తం చేశారు. మైనారిటీ నేతగా, ప్రజాప్రతినిధిగా ఆయన అందించిన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఫరీదుద్దీన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, జగదీష్ రెడ్డి తదితర నేతలు సైతం సంతాపం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు.  

జహీరాబాద్‌ జిల్లా హోతీబీ గ్రామంలో జన్మించిన ఫరీదుద్దీన్... కాంగ్రెస్‌ (congress) నుంచి రాజకీయాల్లో ఎదిగారు.  1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి (ys rajasekhara reddy) కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.  రాష్ట్ర విభజన తర్వాత ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత 2016లో టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios