Asianet News TeluguAsianet News Telugu

మల్లారెడ్డితో అట్లుంటది మరి.. గోవాలో మల్లన్న చిల్, 70 ఏళ్ల వయసులోనూ ఆ ఎనర్జీ వేరే లెవల్

నిన్న మొన్నటి వరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం , రాజకీయాలు, వ్యాపారాలతో బిజీగా వున్న మల్లారెడ్డి కాస్తంత సేదతీరేందుకు గోవాకు వెళ్లారు. ఆయన వెంట కొందరు బీఆర్ఎస్ నేతలు కూడా వున్నారు. మల్లారెడ్డి సముద్రంలో పారా స్లైడింగ్ చేస్తూ హల్ చల్ చేశారు.

ex minister mallareddy is enjoying in goa ksp
Author
First Published Jan 9, 2024, 9:32 PM IST

తన మాటలు , చేష్టలతో అందరినీ నవ్విస్తూ వుంటారు తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి. ఆయనను ఎవరు కదిపినా, లేదా ఏదైనా వేదికలెక్కినా వెంటనే వచ్చే డైలాగ్.. ‘‘కష్టపడ్డా, పాలు , పూలు అమ్మినా, కాలేజీల్ పెట్టినా’’ అంటారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ డైలాగ్స్ పాపులర్. ఇదే ఆయనను మాస్ జనాలకు బాగా దగ్గర చేసింది. ఇక అసెంబ్లీలో మల్లన్న మైక్ అందుకున్నారంటే ఎవరైనా నవ్వు ఆపుకోవడం కష్టమే. ఎంత సీరియస్ వాతావరణాన్నైనా సరే ఆహ్లాదకరంగా మార్చి.. నలుగురిని నవ్వించేలా చేయడం మల్లారెడ్డి స్టైల్. 

ఇదిలావుండగా.. నిన్న మొన్నటి వరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం , రాజకీయాలు, వ్యాపారాలతో బిజీగా వున్న మల్లారెడ్డి కాస్తంత సేదతీరేందుకు గోవాకు వెళ్లారు. ఆయన వెంట కొందరు బీఆర్ఎస్ నేతలు కూడా వున్నారు. మల్లారెడ్డి సముద్రంలో పారా స్లైడింగ్ చేస్తూ హల్ చల్ చేశారు. 70 ఏళ్ల వయసులోనూ ఈ స్థాయిలో హుషారుగా వున్న మల్లన్నను చూసి కుర్రకారు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం మల్లారెడ్డి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios