మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  కాంగ్రెస్‌లో  చేరికకు రంగం  సిద్దమైంది. మరికాసేపట్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు.. జూపల్లి కృష్ణారావు నివాసారికి వచ్చి కాంగ్రెస్‌ పార్టీలో చేరాల్సిందిగా ఆయనను ఆహ్వానించనున్నారు.

హైదరాబాద్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్దమైంది. మరికాసేపట్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు.. జూపల్లి కృష్ణారావు నివాసారికి వచ్చి కాంగ్రెస్‌ పార్టీలో చేరాల్సిందిగా ఆయనను ఆహ్వానించనున్నారు. ఈ క్రమంలోనే జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ భూ స్థాపితం అవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇదే అభిప్రాయంతో ఉన్నారని.. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆ నైతిక అర్హత కూడా కోల్పోయిందని విమర్శించారు. తనను కలిసేందుకు కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డిలు వస్తున్నారని.. వారు ఎందుకు వచ్చారో తెలుసుకుని ఆ తర్వాత తాను మీడియాతో మాట్లాడతానని చెప్పారు.