బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగు రామన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎన్నికలు రాకముందే ప్రచారం చేస్తున్నారని గతంలో పలు పదవులు నిర్వహించినా ప్రజలకు చేసిందేమి లేదన్నారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగు రామన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతంలోకి కొత్త బిచ్చగాళ్లు వచ్చారంటూ ఆయన వ్యాఖ్యానించారు. కొందరు ఎన్నికలు రాకముందే ప్రచారం చేస్తున్నారని గతంలో పలు పదవులు నిర్వహించినా ప్రజలకు చేసిందేమి లేదన్నారు. అలాంటి వాళ్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హేళన చేస్తూ మాట్లాడుతున్నారని జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జెడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్థన్ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగు రామన్న, ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే దుప్పట్ల కోసం జనం ఫంక్షన్ హాల్‌లోకి దూసుకొచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. జనం ఒకరినొకరు తోసుకోవడంతో వారిని అదుపు చేయడం నిర్వాహకులకు కష్టంగా మారింది.
ఇకపోతే... దేశాన్ని రక్షించడం కోసం ఖమ్మం వేదికగా ఈ నెల 18న శంఖారావం పూరించబోతున్నామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ . ఈ సభలో పలు రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారని కేసీఆర్ చెప్పారు. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెంలో నూతన కలెక్టరేట్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం పనిచేసిన స్థాయిలో పనిచేసినట్టుగా కేంద్రం పనిచేస్తే దేశం అభివృద్దిలో ముందుకు సాగేదన్నారు.
Also REad: దేశ రక్షణ కోసం ఈ నెల 18న ఖమ్మం వేదికగా శంఖారావం: కేసీఆర్
కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా తెలంగాణ రాష్ట్రం మూడు లక్షల కోట్లను కోల్పోయిందని కేసీఆర్ విమర్శించారు. దేశంలోని అనేక నదుల్లో పుష్కలమైనా నీటి వనరులున్నా దుర్మార్గమైన నీటి పారుదల పాలసీల వల్ల సాగు, తాగు నీటికి కూడా నోచుకోలేకపోతున్నామని కేసీఆర్ చెప్పారు. దేశంలో నీళ్లున్నా నీటి యుద్ధాలు ఎందుకు సాగుతున్నాయని కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే రకమైన పరిస్థితి నెలకొందని కేసీఆర్ విమర్శించారు.
తెలంగాణ మినహా దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో కూడ 24 గంటల పాటు విద్యుత్ సరఫరా లేదని కేసీఆర్ చెప్పారు. మంచినీళ్లు, విద్యుత్ , సాగు నీళ్లు , ఉద్యోగాలు ఇవ్వరా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రజలకు అవసరమైనవాటిని ఇవ్వకుండా ఏమి ఇస్తారని కేసీఆర్ ప్రశ్నించారు. ఉపన్యాసాలు ఎన్ని రోజులు వినాలో చెప్పాలని ఆయన అడిగారు. ఎన్నికల్లో పార్టీలు, నాయకులు గెలుస్తున్నారన్నారు. ఎన్నికల్లో ప్రజలు గెలవాల్సిన పరిస్థితులు రావాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా దుష్ట పన్నాగాలు సాగుతున్నాయని కేసీఆర్ ఆరోపించారు.
