భారత్ జోడో యాత్ర : రాహుల్ పాదయాత్రలో అపశృతి, కిందపడిపోయిన గీతా రెడ్డి.. స్వల్పగాయాలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. రాహుల్ వెంట పాదయాత్రలో నడిచిన మాజీ మంత్రి గీతారెడ్డి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. 

ex minister geetha reddy fell down at rahul gandhi bharat jodo yatra

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం సంగారెడ్డి జిల్లాలోకి యాత్ర ప్రవేశించింది. అయితే ఈ పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రాహుల్ వెంట పాదయాత్రలో నడిచిన మాజీ మంత్రి గీతారెడ్డి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన కాంగ్రెస్ నేతలు, భద్రతా సిబ్బంది గీతా రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. 

అంతకుముందు మంగళవారం కూడా భారత్ జోడో యాత్రలో చిన్నపాటి అపశృతిచోటుచేసుకుంది. రాహుల్ పాదయాత్రలో చిన్నపాటి తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నితిన్ రౌత్‌కు గాయాలు అయ్యాయి. నితిన్ రౌత్ భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న సమయంలో పోలీసులు నెట్టివేయడంతో ఈ ఘటన జరిగినట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నితిన్ రౌత్ కుడి కన్ను, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని వాసవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ALso REad:రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో తోపులాట.. మహారాష్ట్ర మాజీ మంత్రి నితిన్ రౌత్‌కు గాయాలు..

ఈ విషయంపై దీక్ష రౌత్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘నిన్న హైదరాబాద్‌లో మా నాన్న భారత్‌ జోడో యాత్రలో స్పృహ తప్పి పడిపోయారు. అతడి తలపై చిన్న గాయమైంది. ఆయన త్వరగా కోలుకుని మహారాష్ర్టకు భారత్ జోడో యాత్ర చేరుకున్నప్పుడు.. ఆ ప్రజా ఉద్యమంలో చేరతారని ఆశిస్తున్నాను’’ అని దీక్ష రౌత్ ట్వీట్ చేశారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిత్రాలను కూడా షేర్ చేశారు.  

ఇక, రాహుల్ పాదయాత్ర మంగళవారం ఉదయం హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించింది. మంగళవారం సాయంత్రం చార్మినార్ వద్ద రాహుల్ గాంధీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నెక్లెస్ రోడ్డులో జరిగిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగించారు. నెక్లెస్‌ రోడ్డులో జరిగి కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో సాగుతున్న రాహుల్ యాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. దీంతో పోలీసులు బందోబస్తు కోసం భారీగా సిబ్బందిని మోహరించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios