Asianet News TeluguAsianet News Telugu

సీఎం కుర్చీపై హరీష్ కన్ను.. ఈటల షాకింగ్ కామెంట్స్

 ఇటీవల హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పలపల్లిలో, కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని బొంతుపల్లి గ్రామంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరీష్ రావుపూ విమర్శలు చేశారు. 

Ex Minister Etala Rajendar Allegations on Minister Harish Rao
Author
Hyderabad, First Published Sep 27, 2021, 8:18 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరు పెట్టాలని చూసింది.. ఆర్థిక మంత్రి హరీష్ రావేనని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరు పెడితే కేసీఆర్ కుమార్తె, కుమారుడు, మేనల్లుడు పెడతారని.. తాను పేదవాడినని.. తాను అలాంటివి ఎందుకు చేస్తానంటూ ఈటల పేర్కొనడం గమనార్హం,

ఆయన ఇటీవల హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పలపల్లిలో, కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని బొంతుపల్లి గ్రామంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరీష్ రావుపూ విమర్శలు చేశారు. 

ఇటీవల హరీష్.. తనపై విమర్శలే చేశారని... సీఎం కుర్చీపై తాను కన్ను వేశానని ఆరోపించారని ఈటల పేర్కొన్నారు  నిజానికి సీఎం సీటుకు ఎసరు పెట్టాలని ప్రయత్నించింది హరీషేనని పేర్కొన్నారు. కేసీఆర్ భూమి మీద నడవాలంటే ప్రజలు ఆలోచించి బీజేపీకి ఓటు వేయాలని ఈ సందర్భంగా ఈటల కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్, సీనియర్ నాయకులు మహంకాళి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు, బొంతుపల్లిలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా ఈటల సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios