Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్‌గా చిన్నారెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం బోర్డు ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి, టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ జీ.చిన్నారెడ్డి నియమితులయ్యారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన చిన్నారెడ్డి సుదీర్ఘకాలంగా కాంగ్రెస్‌లో వుంటున్నారు. 

ex minister chinnareddy appointed as vice chairman of telangana planning board ksp
Author
First Published Feb 24, 2024, 7:04 PM IST | Last Updated Feb 24, 2024, 7:04 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం బోర్డు ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి, టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ జీ.చిన్నారెడ్డి నియమితులయ్యారు. కేబినెట్ హోదాలో ఆయనను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన చిన్నారెడ్డి సుదీర్ఘకాలంగా కాంగ్రెస్‌లో వుంటున్నారు. 1970లో విద్యార్ధి నేతగా.. 1985లో యువజన కాంగ్రెస్ నేతగా చురుగ్గా వున్నారు.

1985 అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ నిరుత్సాహపడకుండా 1989లో మరోసారి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1999, 2004, 2014లలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగానూ చిన్నారెడ్డి విధులు నిర్వర్తించారు. 2021లో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios