మల్లన్న సాగర్ దీక్షలో చెరుకు ముత్యం రెడ్డి

ex minister cheruku mutyam reddy visits mallanna sagar deexa
Highlights

టిఆర్ఎస్ సర్కారుకు వార్నింగ్

తోగుట మల్లన్న సాగర్ భూనిర్వాసితుల నిరసన దీక్ష 81వ రోజు  సందర్భంగా మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి పాల్గొని సంఘీభావం తెలిపారు. భూనిర్వాసితులకు 2013 చట్టాన్ని అమలు చేయాలని అదేవిధంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు కానీ భూనిర్వాసితులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయమంటే కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు అడ్డు పడుతుంది అని మాట్లాడడం సరికాదన్నారు. ఇక్కడ ప్రముఖంగా ఉన్న ప్రాజెక్టులు అన్ని కాంగ్రెస్ పార్టీ కట్టిన విషయాన్ని గుర్తుచేశారు. భూ నిర్వాసితుల వెంట ఉండి ఎంతవరకైనా వారితో ఉండి వారికి సరైన న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేస్తామని మద్దతుగా ఉంటామని తెలిపారు.

loader