తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా వున్న టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది.

ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ సికింద్రాబాద్ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఇదే కేసులో నిందితుడిగా వున్న ఆమె భర్త భార్గవ్ రామ్‌‌కు న్యాయస్థానం షాకిచ్చింది.

ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌‌ను కోర్టు కొట్టివేసింది. కిడ్నాప్ కేసులో అరెస్టయిన అఖిలప్రియ ప్రస్తుతం రిమాండ్‌లో వున్నారు. 

Also Read:అంతా మేడమ్ చెప్పినట్లే...: భూమా అఖిలప్రియపై కిడ్నాప్ కేసు నిందితులు

కాగా, భూ వివాదానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువులు నవీన్ రావు, ప్రవీణ్ రావు, సునీల్ రావులను అఖిలప్రియ కిడ్నాప్ చేయించనట్లుగా పోలీసుల విచారణలో తేలింది.

ఈ కేసులో ఆమె భర్త భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను, సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డిల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.