మాజీ మంత్రి ఈటల రాజేందర్  ఇద్దరు అనుచరులు బీజేపీకి గుడ్ బై చెప్పారు. వీరిద్దరూ టీఆర్ఎస్ లో చేరుతామని ప్రకటించారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన నేతలు  పింగళి రమేష్, రంజిత్ కుమార్ లు టీఆర్ఎస్  లో చేరుతామని ప్రకటించారు.

హుజూరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు షాక్ తగిలింది. రాజేందర్ ప్రధాన అనుచరులు పింగిలి రమేష్, చుక్కా రంజిత్‌లు బీజేపీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ లో చేరుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఇవాళ ఉదయం హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రమేఐ్, రంజిత్ లుమీడియాతో మాట్లాడారు. 

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు బీజేపీ నేతలు షాకిచ్చారు. పింగిళి రమేష్ , చుక్కా రంజిత్ కుమార్ లు బీజేపీకి గుడ్ బై చెప్పారు. టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. 

వామపక్ష భావజాలం ఉన్న తాము బీజేపీలో ఇమడలేక పోతున్నామని చెప్పారు. బీజేపీ పార్టీ సిద్దాంతాలు నచ్చలేదన్నారు రమేష్ 
కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అద్భుతమని రమేష్ చెప్పారు.నియోజకవర్గంలో సామాన్యులకు స్థానం కల్పించిన ఘనత కేసీఆర్ దేనని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ లో చేరే తేదీని త్వరలోన ప్రకటిస్తానని ఆయన తెలిపారు.