Asianet News TeluguAsianet News Telugu

ఇంత నిర్భంధం ఉంటే ఉద్యమం సాగేదా?: కేసీఆర్‌ కంటే కిరణే మేలు

తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సమైక్యవాద ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్నట్టుగా నిర్భంధాన్ని విధించలేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య జమున చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చిట్టచివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆమె మెచ్చుకొన్నారు.
 

Etela Rajender wife jamuna praises former chief minister Kiran kumar  lns
Author
Hyderabad, First Published May 30, 2021, 12:52 PM IST

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సమైక్యవాద ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్నట్టుగా నిర్భంధాన్ని విధించలేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య జమున చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చిట్టచివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆమె మెచ్చుకొన్నారు.ఆదివారంనాడు తన నివాసంలో  ఆమె మీడియాతో మాట్లాడారు.  ఇలాంటి పరిస్థితులు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉండుంటే యూనివర్సిటీ విద్యార్థులు బయటకు వచ్చేవారే కాదన్నారు. తెలంగాణ ప్రజలు ఒక్క అడుగు వేయకపోయేవారని చెప్పారు. తమ ఇంటి చుట్టూ పోలీసులే ఉన్నారన్నారు. ఎవరిని భయపెట్టడానికి?  పోలీసులను పెట్టారని ఆమె  ప్రశ్నించారు. 

also read:ఒక్క ఎకరం ఆక్రమించినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా: కన్నీళ్లు పెట్టుకొన్న ఈటల భార్య జమున

దొంగతనం చేశామా  టెర్రరిస్టులమా... పిలిచి చెప్పొచ్చు కదా  అన్నారు. పోలీసులు మా  మా ఇంటి కోసమే పని చేస్తున్నట్టుగా ఉందన్నారు.ఇంటెలిజన్స్ వాళ్లకు మా ఇట్టిదగ్గరే డ్యూటీ వేశారు. మా చుట్టాలను కూడా ప్రశ్నిస్తున్నారు. ఫోన్ నంబర్ ఎంత.. ఎక్కడ ఉంటారంటూ క్వశ్చన్లు వేస్తున్నారని ఆమె తెలిపారు.  పాక్ సరిహద్దులో ఉన్నామా తెలంగాణలో ఉన్నామా? ఏ ప్రభుత్వంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సమైక్యవాద ప్రభుత్వం ఇలా చేయలేదన్నారు. వాళ్లు మెతక వైఖరితో ఉన్నారు.

న్యాయబద్దంగా.. ధర్మబద్దంగా ఉన్నారు. కేసీఆర్‌కు  ఓ న్యాయం లేదు.. ధర్మం లేదని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఏదనుకుంటే అది రాత్రికి రాత్రి కావాలని భావిస్తారన్నారు. ఇప్పటికీ తమ  హేచరీస్ దగ్గర పోలీసులు ఉన్నారన్నారు. నిన్నమొన్నటి వరకు తన భర్త మీ దగ్గరే కదా పని చేశారు కదా అని ఆమె గుర్తు చేశారు.  20 సంవత్సరాలుగా మీ ప్రగతి భవన్ దగ్గర లేదంటే నియోజకవర్గం దగ్గర ఉండేవారన్నారు.  ఐదు నిమిషాలు లేట్ కాగానే తమ్ముడూ.. ఎక్కడున్నావు అంటూ  కేసీఆర్ ఫోన్ చేసేవారని ఆమె గుర్తు చేసుకొన్నారు.తానే  చాలా సార్లు ఫోన్ ఎత్తి మాట్లాడిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. . అలాంటి మీ తమ్ముడు నేడు దెయ్యమెలా అయ్యాడని ఆమె ప్రశ్నించారు.కులరహిత సమాజం కావాలనే ఆనాడు తాము పెళ్లి చేసుకున్నామన్నారు.  తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కులాల వారీగా విభజించించారని అని ఆమె విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios