ఈటల రాజేందర్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు తీర్మానం చేశారు.  ఈ తీర్మానం కాపీని టీఆర్ఎస్ అధిష్టానానికి పంపారు ఈ తీర్మానం కాపీపై  మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల విద్యాసాగర్ రావు , ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వినోద్ లు  సంతకం చేశారు. ఈటలపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని ఆ తీర్మానంలో కోరారు. దీంతో ఈటెల రాజేందర్ మీద వేటుకు రంగం సిద్ధమైనట్లు అర్థమవుతోంది. పార్టీ నుంచి ఆయన పంపించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

also read:అంతా ప్లాన్ ప్రకారంగానే జరిగింది: హైకోర్టులో ఈటల న్యాయవాది

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ  ఈటల రాజేందర్ వ్యవహరించారని   టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్  జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు హైద్రాబాద్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈటలను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ విషయమై  సీఎం కేసీఆర్ కు తీర్మానం కాపీని పంపారు. 

 

మంత్రివర్గం నుండి తప్పించిన తర్వాత  ఈటల రాజేందర్ మాట్లాడిన మాటలను కూడ ఈ సందర్భంగా నేతలు ప్రస్తావించారు. ఈ లేఖ ఆధారంగా ఈటల రాజేందర్ పై పార్టీ వేటు వేసే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు సమర్పించలేదు.