Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ వచ్చాక అసెంబ్లీ మర్యాదలు మంటగలిశాయి.. ఈటల రాజేందర్

తెలంగాణ మంత్రులు సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ వచ్చాక అసెంబ్లీ మర్యాదలు మంటగలిశాయని విమర్శించారు. 

etela rajender says not used any unparliamentary language on Speaker
Author
First Published Sep 7, 2022, 2:19 PM IST | Last Updated Sep 7, 2022, 2:39 PM IST

తెలంగాణ మంత్రులు సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ వచ్చాక అసెంబ్లీ మర్యాదలు మంటగలిశాయని విమర్శించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటేనని ఆరోపించారు. గతంలో ఒక్క సభ్యుడు ఉన్నా బీఏసీ సమావేశానికి పిలిచారని చెప్పారు. అసెంబ్లీలో సభ్యుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. స్పీకర్‌ స్థాయి తగ్గించింది తాను కాదని.. టీఆర్ఎస్ ప్రభుత్వమే ఆ పని చేస్తుందని అన్నారు. తానేమీ అన్ పార్లమెంటరీ పదజాలం వాడలేదని అన్నారు. తనకు ఇప్పటివరకు ఎటువంటి నోటీసు అందలేదని చెప్పారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు. 

కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. చావుకైనా సిద్దమేని.. కానీ రాజీపడే సమస్య లేదన్నారు. స్పీకర్ మీద, శాసనసభ మీద తనకు అపార గౌరవం ఉందని చెప్పారు. రాష్ట్రంలో మంత్రులు సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అనుమతి లేకుండా సీఎం కేసీఆర్‌ను కలవలేరని అన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడటం తప్పా అని ప్రశ్నించారు. 

మరోవైపు అసెంబ్లీ నుండి ఏదో కారణంతో తమను బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నాడు రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు.  బీఏసీ సమావేశానికి తమను ఆహ్వానించాలని పలుమార్లు స్పీకర్‌ను కోరినట్టుగా చెప్పారు. గతంలో ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీలను కూడా బీఏసీ సమావేశానికి  ఆహ్వానించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ఈ నెల 12, 13 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాలకు కూడ తమను రాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని  ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో మైక్ లు విసిరినప్పుడు,గవర్నర్ కుర్చీని తన్నినప్పుడు సభలో సంప్రదాయాలు ఏమయ్యాయని కూడా ఆయన ప్రశ్నించారు. మరమనిషి అనేది నిషేధిత పదమా అని రఘనందన్ రావు అడిగారు. స్పీకర్ ఇచ్చే నోటీసులను చట్టబద్దంగా ఎదుర్కొంటామని చెప్పారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా గొంతు నొక్కుతున్నారన్నారన్నారు.స్పీకర్ ను ప్రశ్నించడం తప్పా అని రఘునందన్ రావు అడిగారు.  అసెంబ్లీలోని  ఎమ్మెల్యేలందరికి ఒకే గౌరవం ఉండాలన్నారు. ఎమ్మెల్యేలు కుర్చీలు వెతుక్కునేలోపుగానే స్పీకర్ నిన్న అసెంబ్లీని వాయిదా వేశారని చెప్పారు. కోట్లాది రూపాయాలు ఖర్చు  చేసి  అసెంబ్లీ నిర్వహించడం ఇందుకోసమేనా అని ఆయన ప్రశ్నించారు.

ప్రజా సమస్యలపై  చర్చించకుండానే  సభను ఎలా వాయిదా వేస్తారని రఘునందన్ రావు అడిగారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే సభ నిర్వహిస్తున్నారా అని ప్రశ్నించారు. .ఏకపక్ష పాలన కేసీఆర్ సర్కార్ కు మంచిది కాదన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios