Asianet News Telugu

తేనెపూసిన కత్తిని కడుపులో పెట్టుకుని కుట్రలు చేసే మనిషి కేసీఆర్ : ఈటల

సీఎం కేసీఆర్ మీద మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కమలపూర్ మండల కేంద్రంలో నిర్వహిచిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశనికి బుధవారం ఈటెల హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఈటెల కేసీఆర్ పనితీరును ఎండకట్టారు. 

etela rajender fires on kcr in warangal meeting - bsb
Author
Hyderabad, First Published Jun 23, 2021, 1:44 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సీఎం కేసీఆర్ మీద మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కమలపూర్ మండల కేంద్రంలో నిర్వహిచిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశనికి బుధవారం ఈటెల హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఈటెల కేసీఆర్ పనితీరును ఎండకట్టారు. 

ఒడ్డు ఎక్కేదాక ఓడమల్లన్న.. ఒడ్డు ఎక్కిన తరువాత బోడి మల్లన్న తరహాలో కేసీఆర్ వ్యవహరిస్తారని మండిపడ్డారు. అధికారం కోసం ఎంతకౌనా తెగించే మనిషి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం డబ్బులు, కుట్రలను నమ్ముకుని ఎన్నికలకు వస్తారన్నారు. 

హుజురాబాద్ ప్రజల ప్రేమ ముందు కేసీఆర్ డబ్బులు, కుట్రలు పనిచేయవన్నారు. ‘నేను ప్రజల ప్రేమను నమ్ముకుని ముందుకు వెడుతున్నా, కేసీఆర్ కుట్రలను నమ్ముకున్నాడు. తేనెపూసిన కత్తిని కడుపులో పెట్టుకుని కుట్రలు చేస్తే హుజురాబాద్ ప్రజలు సహించరు. నువ్వు కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్సీ స్థానాలు గెలవొచ్చు. కోట్లు కుమ్మరించి హుజుర్ నగర్, నాగార్జున సాగర్ గెలవొచ్చు. కానీ హుజూరాబాద్ లో నీ కుట్రలు సాగవు బిడ్డా..’ అంటూ ఫైర్ అయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios