Asianet News TeluguAsianet News Telugu

Etela Rajender:  కేసీఆర్ పై పోటీ చేయడంపై క్లారిటీ ఇచ్చిన ఈటల 

Etela Rajender: తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ప్రచార పర్వం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో అధికార బీఆర్ఎస్ కు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా గులాబీ బాస్ కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమన్నారంటే.. ? 

etela rajender fires on cm kcr  telangana assembly elections 2023 KRJ
Author
First Published Nov 13, 2023, 4:47 AM IST

Etela Rajender: నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారం జోరందుకుంది. తమ ప్రత్యార్థులెవరో క్లారిటీ రావడంతో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు. ఈ తరుణంలో ఇరువర్గాల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. తాజాగా గులాబీ బాస్ సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పై పోటీ చేయడానికి గల కారణాలను వెల్లడించారు.  తానేమీ దిక్కులేక గజ్వేల్ కు రాలేదని, కేసీఆర్ ను ఢీకొట్టేందుకే వచ్చానని, అందుకే ఆయనపై పోటీ చేస్తున్నానని వెల్లడించారు. తనకు అన్యాయం జరిగిందనీ, తాను కూడా  కేసీఆర్ బాధితుడినేనని తెలిపారు. 

ఈసారి ఎన్నికల్లో ఈటల రాజేందర్  హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ లోనూ పోటీ చేస్తున్నారు. తానేమిటో తెలంగాణ ప్రజలకు తెలుసని, ఉద్యమంలో తాను పోషించిన పాత్రను ప్రజలు గుర్తించారని ఈటల పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఎలాగైతే ఒక్కసారి కూడా ఓడిపోలేదో.. తాను కూడా తన రాజకీయ జీవితంలో  ఒక్కసారి కూడా ఓడిపోలేదని ఈటల రాజేందర్ అన్నారు. ఇక సీఎం కేసీఆర్ గెలుస్తాడా? ఈటలను గెలిపిస్తారా? అనేది గజ్వేల్ ప్రజల చేతుల్లోనే ఉందని అన్నారు. 

ఈటల రాజేందర్ ఆదివారం నాడు గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. తాను వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడూ కరోనా కష్టకాలంలో చనిపోతారని తెలిసి కూడా లెక్కచేయకుండా ప్రజలకు సేవచేశానని, కానీ తనని బయటుకు పంపిన తరువాత మంత్రి హరీష్ రావు ఆ సీటులో కూర్చోబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం హుజురాబాద్ ఉపఎన్నికల్లో తనని ఓడించేందుకు.. కేసీఆర్ అక్రమ సంపాదన రూ.600 కోట్లు ఆరు నెలల్లో ఖర్చు పెట్టారని విమర్శించారు. కేసీఆర్‌కి ఓటు వేసిన ఖర్మానికి ప్రజల భూములను లాకున్నారనీ, రాష్ట్రానికి పట్టిన పీడ పోవాలనే తాను కేసీఆర్ పై పోటీ చేస్తున్నానని అన్నారు. తాను గెలుస్తానా? లేదా. అనేది గజ్వేల్ ప్రజల చేతుల్లో ఉందన్నారు. 

రాష్ట్రంలో దళితబంధు ప్రవేశపెట్టింది తనను ఓడించడానికి పెట్టారనీ, కానీ పేరుకు మాత్రమే సరిగా అమలు చేయడం లేదని వాపోయారు. కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా ? ప్రశ్నించారు. ఒడ్డు ఎక్కేదాకా ఓడ మల్లన్న, ఎక్కాక బోడమల్లన్న అన్నచందంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నీళ్లు బందారం రాకముందే గోదావరిలో మునిగిపోయిందని అన్నారు.
 
యువత బతుకులు ఆగం చేస్తున్నారనీ, పిల్లలు ఉద్యోగాలకోసం కష్టపడి చదువుతుంటే.. పైసల కోసం పైరవీ చేసుకున్న వారికి మాత్రమే ఉద్యోగాలు ఉన్నారనీ, 17 పేపర్లు లీక్ చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ఓ అమ్మాయి పరీక్ష వాయిదా పడిందని ఆత్మహత్య చేసుకుంటే..ఆ అమ్మాయి మరణంపై కూడా రాజకీయం చేశారని మండిపడ్డారు.  

Follow Us:
Download App:
  • android
  • ios