మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్రలో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.
హుజురాబాద్‌లో ప్రజా దీవెన యాత్ర నిర్వహిస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్రలో అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం వీణవంక మండలంలోని కొండపాక గ్రామానికి పాదయాత్ర చేరుకుంది. ఈ నేపథ్యంలో లంచ్ తర్వాత అస్వస్థతకు గురయ్యారు ఈటల రాజేందర్. దీంతో ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కాళ్లకు పొక్కులు రావడం , స్వల్పంగా దగ్గు, జలుబు కావడంతో రాజేందర్ అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఆయనను మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలిస్తున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source

