Asianet News TeluguAsianet News Telugu

ఔను, రేవంత్‌ రెడ్డిని కలిశా... అయితే తప్పేంటీ: కేటీఆర్‌ వ్యాఖ్యలకు ఈటల రాజేందర్ కౌంటర్

టీపీసీసీ చీఫ్ (tpcc) రేవంత్ రెడ్డిని కలిసిన మాట వాస్తవమేనని అంగీకరించారు బీజేపీ (bjp) నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender)  రాజీనామా చేశాకే రేవంత్‌ను కలిశానని ఆయన స్పష్టం చేశారు. రేవంత్‌ను తాను కలిస్తే తప్పేంటని ఈటల ప్రశ్నించారు. రేవంత్‌నే కాకుండా ఆ సమయంలో అన్ని పార్టీల నేతలను కలిశానని రాజేందర్ వెల్లడించారు. 

etela rajender counter to minister ktr
Author
Hyderabad, First Published Oct 23, 2021, 5:00 PM IST

టీపీసీసీ చీఫ్ (tpcc) రేవంత్ రెడ్డిని కలిసిన మాట వాస్తవమేనని అంగీకరించారు బీజేపీ (bjp) నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender)  రాజీనామా చేశాకే రేవంత్‌ను కలిశానని ఆయన స్పష్టం చేశారు. రేవంత్‌ను తాను కలిస్తే తప్పేంటని ఈటల ప్రశ్నించారు. రేవంత్‌నే కాకుండా ఆ సమయంలో అన్ని పార్టీల నేతలను కలిశానని రాజేందర్ వెల్లడించారు. 

అంతకుముందు హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెసు కుమ్మక్కయ్యాయని, ఆ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ Huzurabad bypollలో పోటీ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీ రామారావు విమర్శించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఈటల రాజేందర్ రహస్యంగా కలిశారని ఆయన ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. 

ALso Read:Huzurabad bypoll: రేవంత్ రెడ్డిని ఈటల రహస్యంగా కలిశారని కేటీఆర్ వ్యాఖ్య

నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఎన్నికల్లో బిజెపి డమ్మీ అభ్యర్థిని దింపి కాంగ్రెసుకు సహకరించిందని KTR ఆరోపించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ లోకసభ సీట్లలో కూడా గతంలో కాంగ్రెసు ఓట్లు బిజెపికి బదిలీ అయ్యే విధంగా అవగాహనకు వచ్చాయని ఆయన చెప్పారు. లోపాయికారి ఒప్పందంలో భాగంగా బిజెపి, కాంగ్రెసు కలిశాయని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ డబ్బులకు అమ్ముడుపోయారని ఆయన అన్నారు. గాంధీ భవన్ లో గాడ్సేలు దూరారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తులకు కాంగ్రెసులో అగ్రతాంబూలం ఇస్తున్నారని అమరీందర్ సింగ్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. 

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని Revanth Reddyకి మాణిక ఠాగూర్ రూ.500 కోట్లకు అమ్ముకున్నారని, ఆ ఆరోపణ తాను చేయడం లేదని,  కాంగ్రెసు సీనియర్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణ చేశారని, ఆ ఆరోపణను మాణికం ఠాగూర్ ఇప్పటి వరకు ఖండించలేదని ఆయన అన్నారు. తన పార్టీవాళ్లు చేస్తున్న ఆరోపణలపై మాణికం ఠాగూర్ మాట్లాడితే బాగుంటుందని ఆయన అన్నారు.  బిజెపి, కాంగ్రెసు మధ్య లోపాయికారి ఒప్పందం లేకపోతే ఈటల రాజేందర్ కు ఓటేయాలని కాంగ్రెసు నాయకుడు కొండా విశ్వేశ్వర రెడ్డి ఎలా పిలుపునిస్తారని ఆయన అడిగారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా, ఎన్ని చీకటి ఒప్పందాలు చేసుకున్నా కూడా విజ్ఞులైన ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios