సారాంశం


గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి  ఈటల రాజేందర్  తొలిసారిగా బరిలోకి దిగనున్నారు. కేసీఆర్ పై ఈటల రాజేందర్ పోటీకి దిగుతున్నారు. 

హైదరాబాద్: కేసీఆర్ పై తాను పోటీ చేస్తానని  ప్రకటించినట్టుగానే  గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు.  ఈటల రాజేందర్ రెండు అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేయనున్నారు.  తాను ప్రాతినిథ్యం వహిస్తున్న  హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంతో పాటు గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో కూడ  ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు.

కేసీఆర్ పై తాను పోటీ చేస్తానని  మాజీ మంత్రి ఈటల రాజేందర్ గతంలో ప్రకటించారు.ప్రకటించినట్టుగానే గజ్వేల్ నుండి ఈటల రాజేందర్  కేసీఆర్ పై పోటీ చేయనున్నారు.  బీజేపీ తొలి జాబితాలో ఈటల రాజేందర్ కు చోటు దక్కింది. రెండు అసెంబ్లీ స్థానాల నుండి ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. హుజూరాబాద్ , గజ్వేల్ అసెంబ్లీ స్థానాల నుండి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు.

also read:బీజేపీ తొలి జాబితా:సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చోటు, బరిలోకి ముగ్గురు ఎంపీలు

తెలంగాణ సీఎం కేసీఆర్ కూడ ఈ ధఫా రెండు అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేయనున్నారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుండి ఆయన పోటీ చేస్తున్నారు.  గజ్వేల్ అసెంబ్లీ స్తానం నుండి ఈటల రాజేందర్ పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత  కేసీఆర్ కామారెడ్డి నుండి కూడ పోటీ చేస్తున్నారని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

మూడు రోజుల క్రితం గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలతో  కేసీఆర్ సమావేశమయ్యారు.  ఎన్నికల్లో ఏ రకమైన వ్యూహంతో వెళ్లాలనే విషయమై  కేసీఆర్  దిశా నిర్ధేశం  చేశారు. 

తెలంగాణకు రెండు దఫాలు సీఎంగా ఉన్న కేసీఆర్ గజ్వేల్  ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చారని  బీజేపీ ప్రశ్నిస్తుంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంతో పాటు  కేసీఆర్ ఇచ్చిన  హామీలను  ఎన్నికల సమయంలో బీజేపీ ప్రస్తావించనుంది.