ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం వుందన్నారు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాము చెప్పిన అంశాలపై అగ్రనేతలు సానుకూలంగా స్పందించారని వారు పేర్కొన్నారు.

ఢిల్లీలో బీజేపీ పెద్ధలతో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ ముగిసింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహంపై విసృత చర్చించామని తెలిపారు. కేసీఆర్ దోపిడీ పాలనకు అడ్డుకట్ట పడాలంటే బీజేపీతోనే సాధ్యమని వారు పేర్కొన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం వుందని వీరిద్దరూ తెలిపారు. నిర్ణయాలు వేగంగా వుండాలని అధిష్టానాన్ని కోరామని.. తాము చెప్పిన అంశాలపై అగ్రనేతలు సానుకూలంగా స్పందించారని వారు పేర్కొన్నారు. తెలంగాణలో త్వరలోనే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు వుంటాయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల పేర్కొన్నారు.