హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ స్కాంలో మరో ట్విస్ట్ నెలకొంది. అవినీతి ఆరోపణలతో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. 

ఈఎస్ఐ స్కామ్ కు సంబంధి ఏసీబీ అధికారులు జాయింట్ డైరెక్టర్ పద్మను గతంలో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పద్మకు న్యాయస్థానం రిమాండ్ విధించడంతో ఆమె చంచల్ గూడ  జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.  

జైలులో ఖైదీగా ఉండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన పద్మ జైల్లోనే నిద్రమాత్రలు మింది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పద్మ ఆరోగ్యం విషమించడంతో జైలు అధికారులు ఆమెను హుటాహఉటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  

ఉస్మానియా ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో అత్యవసర చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె ప్రాణానికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తేల్చి చెప్పారు.