Asianet News TeluguAsianet News Telugu

చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకు జైలు శిక్ష

చెక్ బౌన్స్ కేసులో సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబుకు కోర్టు ఏడాది జైలు శిక్షను విధిస్తూ కోర్టు  ఎర్రమంజిల్ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ జైలు శిక్షతో పాటు రూ.41.75 లక్షల జరిమానాను కూడ విధించింది.

erramanzil court orders to cine actor mohan babu one year jail , rs, 41.75 lakh fine
Author
Hyderabad, First Published Apr 2, 2019, 1:14 PM IST

హైదరాబాద్: చెక్ బౌన్స్ కేసులో సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబుకు కోర్టు ఏడాది జైలు శిక్షను విధిస్తూ కోర్టు  ఎర్రమంజిల్ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ జైలు శిక్షతో పాటు రూ.41.75 లక్షల జరిమానాను కూడ విధించింది...

2010లో చెక్ బౌన్స్ కేసును దర్శకుడు వైవీఎస్ చౌదరి వేశాడు. ఈ కేసులో ఏ 1 లక్ష్మీ ప్రసన్నపిక్చర్స్, ఏ2గా మోహన్ బాబు ఉన్నాడు.2010 లో రూ. 48 లక్షలు చెక్ బౌన్స్ వ్యవహారంపై చెక్‌బౌన్స్‌ కేసు వ్యవహారంలో నిర్మాత వైవీఎస్‌ చౌదరి కోర్టును ఆశ్రయించారు. 

ఈ కేసులో ఏ1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్‌, ఏ2గా మంచు మోహన్‌బాబుగా కోర్టు తేల్చింది.2010 సంవత్సరంలో ఈ వ్యవహారంపై కేసు నమోదైంది.  బాధితుడికి కోర్టు ఆదేశాల మేరకు జరిమానాగా రూ.41.75 లక్షలు చెల్లించకపోతే మరో మూడు మాసాల పాటు జైలు శిక్షను పొడిగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.మంగళవారం నాడు ఈ కేసు విషయమై ఎర్రమంజిల్ 23 కోర్టు జడ్డిజ వి. రఘునాథరావు తీర్పు వెలువరించారు. 

సలీం సినిమా చిత్ర నిర్మాణ సమయంలో ఈ వివాదం చోటు చేసుకొంది. ఈ కేసులో ఏ1 గా లక్ష్మీప్రసన్న పిక్చర్స్ కు రూ. 10వేల జరిమానాను విధించింది.ఈ జరిమానాను చెల్లించకపోతే లక్ష్మీప్రసన్న పిక్చర్స్ కు కూడ నెల రోజుల పాటు జైలు శిక్షను కూడ విధించింది.

మరో వైపు ఈ కేసు విషయమై పై కోర్టుకు మోహన్ బాబు వెళ్లిన కూడ తాము కూడ వెళ్లామని వైవీఎస్ చౌదరి తరపు న్యాయవాదులు కూడ చెబుతున్నారు.ఇదిలా ఉంటే నటుడు మోహన్ బాబు ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios