జర్మనీలో ప్రమాదం.. కడారి అఖిల్ కుటుంబాన్ని పరామర్శించిన ఎర్రబెల్లి..

జర్మనీలో నీటిలో తప్పిపోయిన కడారి అఖిల్ కుటుంబాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు.

Errabelli visits Kadari Akhil's family in Warangal

వరంగల్ నగరం కరీమాబాద్ లోని మధ్య తరగతి కుటుంబం కడారి పరశు రాములు, అన్నమ్మల కొడుకైన అఖిల్ ఉన్నత చదువుల కోసం  జర్మనీకి వెళ్ళాడు. గత కొద్దికాలంగా అక్కడే సెటిల్ అయ్యారు. అయితే, 5 రోజుల క్రితం జర్మనీలోనే అఫీస్ పనిపై వెళ్లి నీటిలో మిస్ అయ్యాడు. ఆయన వెంట ఉన్న మిత్రులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు. దేశం కాని దేశం కావడంతో సమాచారం సరిగా లేదు. దీంతో కరీమాబాద్ లోని అఖిల్ అమ్మా, నాన్న లు ఆందోళనతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. 

కాగా, విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బుధవారం ఉదయం వారి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించారు. పరిస్థితిని తెలుసుకున్నారు. తను సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళి తగు సహాయక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వాళ్ళను ఓదార్చారు. మంత్రి వెంట వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఆ కాలనీ వాసులు ఉన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios