ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ, లక్ష్మీపార్వతి  వల్లే తనకు అప్పట్లో మంత్రి పదవి దక్కలేదని  ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. 


హైదరాబాద్: ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ, లక్ష్మీపార్వతి వల్లే తనకు అప్పట్లో మంత్రి పదవి దక్కలేదని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.

మంగళవారం నాడు కేసీఆర్ కేబినెట్‌లో ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

తాను టీడీపీలో ఉన్న సమయంలో కేబినెట్‌లో తనకు అవకాశం కల్పిస్తానని ఎన్టీఆర్ అప్పట్లో హామీ ఇచ్చారని చెప్పారు.కానీ, తనకు లక్ష్మీపార్వతి వల్లే కేబినెట్‌లో చోటు దక్కలేదన్నారు. ఆ తర్వాత చంద్రబాబునాయుడు కూడ తన కేబినెట్‌టో చోటు కల్పిస్తానని ఇచ్చిన హామీని కూడ నెరవేర్చలేదని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. 

కేసీఆర్ తనపై నమ్మకం ఉంచి ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తానని దయాకర్ రావు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. జిల్లాలోని పార్టీ నేతలను కలుపుకొనిపోతానన్నారు.