Asianet News TeluguAsianet News Telugu

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల‌కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. నేటి నుంచే తిరిగి విదుల్లోకి..

తెలంగాణలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల‌కు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను మ‌ళ్లీ విధుల్లోకి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 

errabelli dayakar rao orders on field assistant joining
Author
First Published Aug 10, 2022, 5:10 PM IST

తెలంగాణలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల‌కు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను మ‌ళ్లీ విధుల్లోకి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈరోజు నుంచే ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను విధుల్లోకి తీసుకోవాల‌ని పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అధికారులను ఆదేశించారు. వివరాలు.. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లో నుంచి తొలగించింది. అయితే తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంబట్లు కోరడం, ఈ మేరకు పార్టీ నాయకుల నుంచి వినతులు రావడంతో.. వారిని విధుల్లో తీసుకోవడానికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  అసెంబ్లీలో కూడా ఇందుకు సంబంధించి ప్రకటన చేశారు. 

ఈ క్రమంలోనే నేటి నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను విధుల్లోకి తీసుకోవాల‌ని.. క‌లెక్ట‌ర్లు, జిల్లా అధికారుల‌కు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆదేశాలు జారీ చేశారు. దీంతో  గ‌తంలో ప‌ని చేసిన చోటే 7,305 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల విధులు నిర్వ‌ర్తించ‌నున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios