వరంగల్:  ఉమ్మడి వరంగల్ జిల్లాలోని  వరంగల్ రూరల్ మండలంలోని పర్వతగిరిలోని 244 పోలింగ్ కేంద్రంలో  ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

పాలకుర్తి నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావు  కుటుంబసభ్యులతో  కలిసి శుక్రవారం నాడు కుటుంబసభ్యులతో కలిసి ఓటుహక్కును వినియోగించుకొన్నారు.

ప్రతి ఒక్కరూ  తమ ఓటు హక్కును  వినియోగించుకోవాలని  ఆయన  కోరారు. తాను ఎక్కడ ఉన్న కూడ పర్వతగిరిలో ఓటు హక్కును  వినియోగించుకొంటానని దయాకర్ రావు చెప్పారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానం నుండి దయాకర్ రావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల తర్వాత దయాకర్ రావు టీడీపీని వీడి టీఆర్ఎష్ లో చేరారు.