టీడీపీ తనకు కన్నతల్లి లాంటిదని టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొలుత టీడీపీలో ఉన్న ఆయన ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. కాగా..నియోజకవర్గ ప్రజల అభవృద్ధి కోసమే తాను కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరానని తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. 

పెర్కవేడు, తిర్మలాయపెల్లి, మైలారం గ్రామాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, మహాఅన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాలుగున్నరేళ్లలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, మళ్లీ గెలిపిస్తారన్న నమ్మకం తనకుందని ఎర్రబెల్లి అన్నారు. అలాగే ప్రజలు కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మి ఓటును వృథా చేసుకోవద్దని ఆయన హితవు పలికారు.