స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ ప్రమాదవశాత్తు రెండో అంతస్తునుండి జారిపడి ఇంజనీరింగ్ యువతి మృతిచెందిన దారుణం హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్ : స్నేహితులతో సరదాగా గడుపుతూ ఒక్కసారిగా ప్రమాదానికి గురయి ఇంజనీరింగ్ యువతి దుర్మరణం చెందింది. రెండో అంతస్తునుండి జారిపడి యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వనపర్తి పట్టణానికి చెందిన శోభన్ ఉపాధి నిమిత్తం భార్యాపిల్లలతో హైదరాబాద్ లో నివాసముంటున్నాడు. ఉప్పల్ లో ఓ ఇంట్లో అద్దెకుంటూ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతడి కూతురు రమ్య(21) ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోంది. అయితే ఇంటినుండి కాలేజీ దూరంగా వుండటంతో కాలేజీకి దగ్గర్లోనే ఓ హాస్టల్లో వుంటోంది.

శనివారం రాత్రి రమ్య హస్టల్లో స్నేహితులతో కలిసి రెయిలింగ్ పై కూర్చుని సరదాగా ముచ్చటిస్తూ ప్రమాదానికి గురయ్యింది. ఒక్కసారిగా అదుపుతప్పి రెయిలింగ్ పై నుండి జారి అమాంతం రెండో అంతస్తు నుండి కిందపడిపోయింది. ఇలా స్నేహితులతో ముచ్చటిస్తూ ఒక్కసారిగా ప్రమాదానికి గురయిన రమ్యను హాస్టల్ సిబ్బంది హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావమై పరిస్థితి విషమించడంతో రమ్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

 Read more ప్రేమవివాహం చేసుకున్న.. ఐదునెలలకే పుట్టింట్లో వివాహిత ఆత్మహత్య..

ఇంజనీరింగ్ చదువుతున్న కూతురు ఇలా దుర్మరణం చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. యువతి మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అందించారు. ఇదిలావుంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇలా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడానికి వెళుతున్న ప్రేమజంట ప్రమాదానికి గురయ్యారు. యువకుడు మృతిచెందగా యువతి తీవ్రంగా గాయపడింది. ఈ దుర్ఘటన కాకినాడ జిల్లా పిఠాపురంలో చోటుచేసుకుంది. జగన్నాథపురానికి చెందిన పాలెపు గణేశ్, దీప్తి మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ప్రేమ పెళ్లి కోసం అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదంపై గణేశ్ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతి బంధువులపై ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లిచేసుకోడానికే గణేష్, దీప్తీ అన్నవరం ఆలయానికి వెళుతుంగా పిఠపురం వద్ద బైక్ డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో గణేష్ అక్కడికక్కడే మృతిచెందగా యువతి తీవ్ర గాయాలతో పడిపోయింది. ప్రమాదంపై సమాచారం అందుకున్నపోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రోడ్డు పక్కన రక్తపుమడుగులో పడివున్న యువతిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

అయితే యువతి తల్లిదండ్రులే ప్రేమజంటపై దాడి చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు యువకుడి తల్లిదండ్రులు. వీరి ప్రేమ వ్యవహారమే అందుకు కారణమని... ఇది ముమ్మాటికీ పరువు హత్యేనని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసారు.