నేషనల్ హెరాల్డ్ కేసు: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ లో విచారణకు రావాలని ఈడీ ఆ నోటీసులో పేర్కొంది.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన ఢిల్లీలో విచారణకు రావాలని ఈడీ ఆ నోటీసులో పేర్కొంది. కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, రేణుకా చౌదరి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ కి నోటీసులు జారీ చేసినట్టుగా ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఏబీఎన్ కథనం ప్రసారం చేసింది.
అయితే తనకు ఈడీ నుండి ఎలాంటి నోటీసులు రాలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ప్రకటించారు. అయితే నేషనల్ హెరాల్డ్ పత్రిక నడపడానికి తాను కొంత ఫండ్ ఇచ్చినట్టుగా షబ్బీర్ అలీ చెప్పారు. తాను చెక్ రూపంలోనే ఈ పత్రిక నిర్వహణకు చెక్ రూపంలోనే నిధులను అందించినట్టుగా ఆయన ప్రకటించారు. ఒకవేళ ఈడీ నుండి నోటీసులు అందితే తాను ఈడీకి వివరణ ఇస్తానని షబ్బీర్ అలీ ప్రకటించారు. అయితే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఇప్పటికే రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను కూడా ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. తొలుత రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హజరయ్యారు. అనారోగ్యం కారణంగా ఈడీ నోటీసులు జారీ చేసిన తర్వాత కొంత సమయం ఇవ్వాలని సోనియా గాంధీ కోరారు. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత ఈడీ విచారణకు సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే.
రాహుల్ గాంధీ, సోనియాగాంధీలను ఈడీ విచారణ సమయంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనలు నిర్వహించారు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ నేతలునిరసనలకు దిగారు. ఇదే కేసులో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గేను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు.