కరీంనగర్‌లో కీలక పరిణామం: బండి సంజయ్ ఫిర్యాదుతో రంగంలోకి ఈడీ.. 9 గ్రానైట్ క్వారీలకు నోటీసులు

కరీంనగర్‌లోని 9 గ్రానైట్ క్వారీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఎంపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదుతో ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది

enforcement directorate issued notices to granite quarries in karimnagar ksp

కరీంనగర్‌లోని 9 గ్రానైట్ క్వారీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఎంపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదుతో ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ నోటీసుల్లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. వివిధ దేశాలకు గ్రానైట్ ఎగుమతి చేశారని సంజయ్ ఫిర్యాదులో తెలిపారు. దీంతో ఎంత గ్రానైట్ ఎగుమతి చేశారో వివరణ ఇవ్వాలని ఈడీ నోటీసులో పేర్కొంది. 

కరీంనగర్ నుంచి కాకినాడ, కృష్ణపట్నం మీదుగా విదేశాలకు గ్రానైట్ ఎగుమతి చేస్తున్నాయి ఆ క్వారీ సంస్థలు. ఇదే కేసుకు సంబంధించి గత నెలలో చెన్నైలోని ఎలైట్ షిప్పింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది ఈడీ. తాజాగా శ్వేత ఏజెన్సీ, ఏఎస్ షిప్పింగ్, జేఎం బ్యాక్సీ గ్రానైట్, మైథిలి ఆదిత్య ట్రాన్స్‌పోర్ట్, కేవీఏ  ఎనర్జీ, అరవింద్, శాండియా ఏజెన్సీస్, పీఎస్ఆర్ ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. 
 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios