చీకోటి ప్రవీణ్ వాట్సాప్ లో కీలక సమాచారం: డేటాను పరిశీలిస్తున్న ఈడీ అధికారులు

 కేసీనో వ్యాపారం నిర్వహించిన చీకోటి ప్రవీణ్  వాట్సాప్ లో ఈడీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరంచారు. 

Enforcement Directorate Gathers Key Information From chikoti Praveen Whatsapp

హైదరాబాద్: కేసీనో వ్యాపారం నిర్వహించిన Chikoti Praveen వాట్సాప్ లో కీలక సమాచారాన్ని ఈడీ అధికారులు సేకరించారు.  ఈడీ అధికారలు 20 గంగల పాటు రెండు రోజుల క్రితం ప్రవీణ్  ఇంట్లో సోదాలు నిర్వహించారు.ప్రవీణ్ తో పాటు Madhava Reddy నివాసంలో కూడా  Enforcement Directorate, అధికారులు సోదాలు నిర్వహించిన  విషయం తెలిసిందే.

చీకోటి ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డిలను విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆగష్టు 1వ తేదీన విచారణకు రావాలని ఈడీ అధికారులు ఆదేశించారు.చీకోటి ప్రవీణ్ కు చెందిన ల్యాప్ టాప్ ను  మొబైల్ ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. నేపాల్,, సింగపూర్, థాయ్ లాండ్ వంటి దేశాలకు ప్రముఖులను తీసుకెళ్లిన ప్రవీణ్  కేసినో ఆడించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 

నేపాల్, సింగపూర్, థాయ్ లాండ్  దేశాలకు 140 మందితో తీసుకెళ్లాడు. ప్రత్యేక విమానాలతో వీరిని తీసుకెళ్లినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు.  వాట్సాప్ లో ప్రముఖులతో చాటింగ్ కు సంబంధించిన సమాచాారాన్ని కూడా ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. సినీ తారలతో పాటు వీవీఐపీలు, రాజకీయ నేతలతో ప్రవీణ్ చాటింగ్ లపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.

హావాలా ద్వారా డబ్బులను ప్రవీణ్  తరలించినట్టుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రవీణ్ లాప్ టాప్ లోని అనుమానాస్పద లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ కు చెందిన నాలుగు బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు గుర్తించారు.  ఈ బ్యాంకు ఖాతాల్లో నామ మాత్రపు డబ్బులు ఉన్నాయని ఈడీ అధికారులు గుర్తించారు. విదేశాలకు కేసినో ఆడేందుకు వెళ్లే వారి నుండి  నగదు రూపంలోనే ప్రవీణ్ డబ్బులు తీసుకొన్నాడని సమాచారం. మరో వైపు  కేసినో వ్యాపారానికి సంబంధించి సినీ తారలతో కూడా ప్రవీణ్ ప్రచారం చేయించాడు. సినీతారలతో ప్రచారానికి సంబంధించిన ప్రోమోలను కూడా వాట్సాప్ ద్వారా ప్రవీణ్  షేర్ చేశారని ఈడీ అధికారులు గుర్తించారని ఆ కథనం  తెలిపింది.

also read:క్యాసినోలకు సినీతారల ప్రచారం.. యాక్టర్లకు ఈడీ నోటీసులు ?
బిగ్ డాడీ అడ్డా  కోసం  సినీ తారలతో ప్రమోషన్. నిర్వహించారని ఈడీ అధికారులు గుర్తించారు. కేసీనో ఎక్కడ లీగల్ లో ఎక్కడే తాను కేసినో నిర్వహించినట్టుగా చీకోటి ప్రవీణ్ గురువారం నాడు మీడియాకు చెప్పారు. నేపాల్, గోవాల్లో కేసీనో లీగల్ అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సోమవారం నాడు ఈడీ అధికారులు విచారణకు రావాలని కోరిన విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ఈడీ అధికారుల ప్రశ్నలకు తాను సమాధానం ఇస్తానని ఆయన చెప్పారు. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసీనో వ్యవహరంలో ప్రవీణ్ పేరు తెరమీదికి వచ్చింది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏపీలోని గుడివాడలో నిర్వహించిన సంబరాల సందర్భంగా కేసినో నిర్వహించారనే ప్రచారంతో ప్రవీణ్ వ్యవహరం ఏపీలో కూడా చర్చకు దారితీసింది. అయితే కేసినో నిర్వహించలేదని ప్రవీణ్ అప్పట్లో ఖండించారు.ఈ విషయమై టీడీపీ విమర్శలపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా ఖండించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios