హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె రోజురోజుకు తీవ్రతరమవుతుంది. రోజురోజుకు ఆర్టీసీ సమ్మె సరికొత్త మలుపులు తిరుగుతుంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైకోర్టు సూచనలను సైతం తెలంగాణ సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ కార్మికులతో చర్చించే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్నారు. 

అటు టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు సైతం ప్రభుత్వం చర్చలు జరిపే వరకు సమ్మె విరమించేదిలేదని తేల్చి చెప్తోంది. అంతేకాదు ఈనెల 19న టీఆర్ఎస్ ఆర్టీసీ జేఏసీ నేతలతోపాటు వామపక్షాలు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి. 

తెలంగాణ బంద్ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కార్మికులు మరికాసేపట్లో తెలంగాణ సీఎస్ ఎస్ కే జోషిని కలవనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సమస్యలతోపాటు ఆర్టీసీ కార్మికుల సమస్యలపై వినతిపత్రం సమర్పించనున్నారు. 

ఆర్టీసీ సమ్మెకు దారితీసిన కారణాలను వివరిస్తూనే 15 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్యోగ సంఘాలు ప్రయత్నిస్తున్నాయి.   టీఎన్జీవో కార్యాలయంలో జరగాల్సిన ఉద్యోగ సంఘాల జేఏసీ భేటీ రద్ద అయింది. సీఎస్‌ ఎస్‌కే జోషిని ఉద్యోగ సంఘాల నేతలు సాయంత్రం కలవనున్నారు. 

ఉద్యోగుల సమస్యలతో పాటు, ఆర్టీసీ కార్మికుల సమస్యలపై వినతిపత్రం ఇవ్వనున్నారు. 15 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి ఉద్యోగ సంఘాలు తీసుకెళ్లనున్నాయి. ఇకపోతే తెలంగాణ బంద్ నేపథ్యంలో టీఎన్జీవోలు ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇవ్వని నేపథ్యంలో సీఎస్ తో ఉద్యోగ సంఘాల భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.