Asianet News TeluguAsianet News Telugu

పీఆర్‌సీ సహా సమస్యలను పరిష్కరిస్తా: ఉద్యోగుల సమావేశంలో రేవంత్ రెడ్డి

ఉపాధ్యాయ, ఉద్యోగులతో తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.

Employee Association Will Be Given Top Priority: Revanth Reddy lns
Author
First Published Mar 11, 2024, 6:37 AM IST

హైదరాబాద్:ఉద్యోగుల డీఏతో పాటు ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని  తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చెప్పారు.ఆదివారంనాడు ఎంసీహెచ్ఆర్డీలో   ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగులు,ఉపాధ్యాయులకు వేతన సవరణలో న్యాయం చేస్తామని  రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పదేళ్లుగా మీ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం రాలేదన్నారు. మీ సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతోనే ఎన్నికల మేనిఫెస్టోలో  అనేక అంశాలను పొందుపర్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను పరిష్కరించే  బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

also read:మానవత్వం చాటుకున్న మంత్రి జూపల్లి: ఫిట్స్ వచ్చిన వ్యక్తి ఆసుపత్రికి తరలింపు
 
ఆయా ఉద్యోగ, కార్మిక సంఘాలకు కేసీఆర్ కుటుంబ సభ్యులే గౌరవ అధ్యక్షులుగా ఉన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.నిర్బంధాలతో పాలన సాగిస్తామనుకోవడం కేసీఆర్ భ్రమగా ఆయన పేర్కొన్నారు.సమస్యలకు పరిష్కారం నిర్బంధాలు కాదు.. చర్చలేనని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో  విశ్వాసం కల్పించడానికే  చర్చలు జరిపినట్టుగా రేవంత్ రెడ్డి తెలిపారు.ఉద్యోగుల  సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

also read:ఎక్కడ ఏ పార్టీ పోటీ చేయాలో రెండు రోజుల్లో స్పష్టత: పొత్తులపై పురంధేశ్వరి

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనన్నారు.ఈ విషయమై కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో కిందిస్థాయి సిబ్బందిని నియమిస్తామని  ఆయన చెప్పారు.ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఉద్యోగుల తరపున ప్రాతినిధ్యం ఉండాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ తామే సాధించామని చెప్పుకున్నా అది అసంబద్దమేన్నారు. 

also read:ముహుర్తం ఫిక్స్: వైఎస్ఆర్‌సీపీలోకి ముద్రగడ పద్మనాభం

విద్యార్థి, ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మిక సంఘాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్దించిందన్నారు.రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతారని ఆయన విమర్శించారు.కేసీఆర్ కుటుంబంలో ఎవరి రక్తం చిందలేదేమో కానీ...తెలంగాణ కోసం కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారు రక్తాన్ని చిందించారన్నారు.
శ్రీకాంతాచారి లాంటి వారు మాంసపు ముద్దలయ్యారని ఆయన గుర్తు చేశారు.

also read:రోబో ద్వారా భోజనం సరఫరా: సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

తెలంగాణ ఆత్మను గౌరవించకపోతే సమాజం మనల్ని క్షమించదని రేవంత్ రెడ్డి  చెప్పారు.తెలంగాణలో ఆదాయం పడిపోయింది... ఆదాయం కోసం కేవలం లిక్కర్ పైనే ఆధారపడేలా కేసీఆర్ పాలన సాగిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.1వ తేదీన  ఉద్యోగులకు జీతాలు వేసినా తాము ప్రచారం చేసుకోలేదన్నారు. 
మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు. 

ఒక్కో చిక్కుముడిని విప్పుతూ ఉద్యోగాల భర్తీని ముందుకు తీసుకెళ్ళామని రేవంత్ రెడ్డి వివరించారు.11వేల పైచిలుకు ఉద్యోగాలతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.రోజుకు 18 గంటలు పని చేస్తూ పాలనను గాడిలో పెడుతున్నామన్నారు.

తమ ప్రభుత్వం మూడు నెలలు ఉంటది.. ఆరు నెలలు ఉంటదని కొందరు మాట్లాడుతున్నారు... తమాషా అనుకుంటున్నారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.తమది ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వమని రేవంత్ రెడ్డి  చెప్పారు.పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంపై గౌరవం, విశ్వాసం ఉండాలని రేవంత్ రెడ్డి  విపక్షనేతకు సూచించారు.

95శాతం మంది ఉద్యోగులు నిజాయితీగా పనిచేస్తున్నారన్నారు.ఉద్యోగ సంఘాలపై కక్షగట్టి వాటిని రద్దు చేస్తే ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారని ఆయన సెటైర్లు వేశారు.శాఖలవారీగా ఉద్యోగ సంఘాలు ఉండాల్సిందేనన్నారు.వివిధ శాఖల్లో ఉన్న 1100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం వివరించారు.

గవర్నర్ తో మాట్లాడి కోదండరాం సార్ ను శాసన మండలికి పంపుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.  ఆయన ఎమ్మెల్సీగా ఉంటే శాసన మండలికి గౌరవం వస్తుందని  ఆయన అభిప్రాయపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios