Asianet News TeluguAsianet News Telugu

కరోనా మరణ మృదంగం... సిరిసిల్ల జిల్లాలో విద్యాధికారి మృతి

ఇప్పటికే కరోనా వైరస్ తెలంగాణ పోలీస్ శాఖలో కలకలాన్ని సృష్టించగా తాజాగా విద్యాశాఖలోనూ అలజడి రేపింది. 

Ellareddypet MEO Death with corona akp
Author
Sircilla, First Published Apr 28, 2021, 4:43 PM IST

సిరిసిల్ల: దేశవ్యాప్తంగానే కాదు తెలంగాణలోనూ కరోనా మహమ్మారి దావానంలా వ్యాపిస్తూ ప్రజల ప్రాణాలను బలితీసుకుంటోంది. ఇప్పటికే ఈ వైరస్ తెలంగాణ పోలీస్ శాఖలో కలకలాన్ని సృష్టించగా తాజాగా విద్యాశాఖలోనూ అలజడి రేపింది. ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ విద్యాశాఖ అధికారి తాజాగా మరణించాడు.  

ఎల్లారెడ్డిపేట మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్(ఎంఈవో) మంకు రాజయ్య కరోనాబారిన పడి హైదరాబాద్ లో యశోద హాస్పిటల్ లో చికిత్స పొందాడు. అయితే బుధవారం అతడి ఆరోగ్యం మరింత క్షీణించి తుదిశ్వాస విడిచాడు. దీంతో సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ అధికారుల్లో ఆందోళన మొదలయ్యింది.   

read more   కరోనాతో జనం పిట్టల్లా రాలిపోతుంటే.. ఒక్క సమీక్ష లేదు: కేసీఆర్‌పై బండి సంజయ్ విమర్శలు

ఇలా కరోనా మరణాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో  ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. వారం రోజులుగా రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడుతున్నాయని... అయినా కూడా రానున్న మూడు నాలుగు వారాలు చాలా కీలకమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 45 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్టుగా ఆయన చెప్పారు. రాష్ట్రంలో కరోనా సోకిన వారిలో 95 శాతం  రికవరీ అవుతున్నారని  ఆయన చెప్పారు. 

కరోనాపై ప్రజల్లో ఎప్పటికప్పుడు  అవగాహన కల్పిస్తున్నట్టుగా చెప్పారు. లక్షణాలు ఉంటేనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. విరోచనాలు, జ్వరం, వాసన కోల్పోవడం, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు ఉన్నవారే పరీక్షలకు రావాలని  ఆయన సూచించారు.రాష్ట్రంలో కోవిడ్ రోగులకు  బెడ్స్ , ఆక్సిజన్ అందుబాటులో ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కలిపి బాధితులకు 50 వేల పడకలు కేటాయించినట్టుగా చెప్పారు. అవసరమైతే తప్ప ఆసుపత్రుల్లో చేరవద్దని ఆయన కరోనా రోగులను కోరారు.

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం అని శ్రీనివాసరావు సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios