Asianet News TeluguAsianet News Telugu

ఇల్లంతకుంట ఎస్సై తప్పేం లేదా... బిజెపి కార్యకర్తలు కావాలనే రెచ్చగొట్టారా..?

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇళ్లంతకుంత ఎస్సై మహేందర్ బిజెపి కార్యకర్తలను కొట్టిన వీడియో వైరల్ కావటంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. దీనిపై పోలీస్ అధికారులు, బీజేపీ కార్యకర్తలు ఎవరి వెర్షన్ వారు వినిపిస్తున్నారు. 

ellanthakunta si vs bjp activists issue in rajanna sircilla
Author
Ellanthakunta, First Published Aug 19, 2022, 5:31 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇళ్లంతకుంత ఎస్సై మహేందర్ బిజెపి కార్యకర్తలను కొట్టిన వీడియో వైరల్ కావటంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. గత వారం రోజుల నుండి ఇల్లంతకుంత బిజెపి మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతి ఎస్సై నే టార్గెట్  చేస్తూ ఎక్కడ స్థానిక ఎమ్మెల్యే కార్యక్రమం ఉంటే అక్కడ ఎస్సై బందోబస్తు ఉండటంతో అక్కడకి వెళ్లి ఎమ్మెల్యే ను అడ్డుకోవటం, ఘెరావ్ చేయటంతో ఎస్సై వారికి పలుమార్లు నచ్చజెప్పారు. 

కానీ గత వారం రోజులుగా ఇలానే జరుతుండడంతో బిజెపి మండల అధ్యక్షుడిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా నిరసన ప్రదర్శనలు నిర్వహించుకునే హక్కు ఉందని కానీ స్థానిక ఎమ్మెల్యే వచ్చిన ప్రతీసారీ ఇది తగదని, ఇలా చేయటం వలన పోలీసుల పట్ల నమ్మకం పోతుందని నచ్చజెప్పారు. మీకేమైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే తో మాట్లాడుకోవాలని అన్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 

కానీ ఈసారి బిజెపి మండల అధ్యక్షుడు తిరుపతి స్థానిక కార్యకర్తలను రెచ్చగొడుతూ ఎమ్మెల్యే మీదకి, పోలీసుల మీదకి ఉసిగొల్పడంతో ఎస్సై తక్షణం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించాల్సిన అవసరం ఏర్పడిందనే వాదన వినిపిస్తోంది. దాంతో బిజెపి కార్యకర్తలు పరుష పదజాలంతో పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారని అంటున్నారు. దాంతో ఎస్సై తోసుకుంటూ పోలిస్ జీప్‌లోకి ఎక్కించి పీఎస్‌కి తరలించారని వివరణ ఇస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios