Asianet News TeluguAsianet News Telugu

ఇబ్రహీం పట్నంలో డబ్బు పట్టివేత: టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేదంటూ ఆరోపణలు

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ధన ప్రవాహం అడ్డుకట్టకు రంగం సిద్ధమైంది. ఒకవైపు అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తుంటే మరోవైపు డబ్బు సరఫరాకు తెరలేపుతున్నారు. ఎన్నికల్లో ధనప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎలక్షన్‌ కమిషన్‌ తన టీంతో రెడీ అయ్యింది. ఎలక్షన్‌ స్క్వాడ్‌లను రంగలోకి దించి ముమ్మురమైన తనిఖీలు చేపట్టింది. 
 

election squad seizedhuge amount belongs trs leader ibrahimpatnam
Author
Ranga Reddy, First Published Oct 15, 2018, 6:53 PM IST

రంగారెడ్డి : తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ధన ప్రవాహం అడ్డుకట్టకు రంగం సిద్ధమైంది. ఒకవైపు అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తుంటే మరోవైపు డబ్బు సరఫరాకు తెరలేపుతున్నారు. ఎన్నికల్లో ధనప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎలక్షన్‌ కమిషన్‌ తన టీంతో రెడీ అయ్యింది. ఎలక్షన్‌ స్క్వాడ్‌లను రంగలోకి దించి ముమ్మురమైన తనిఖీలు చేపట్టింది. 

ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురునానక్‌ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద సోమవారం ఎలక్షన్‌ స్క్వాడ్‌  తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.27 లక్షల నగదును ఎలక్షన్‌ స్క్వాడ్‌ అధికారులు పట్టుకున్నారు.

 పట్టుబడిన సొమ్ము ఆదిబట్ల గ్రామ ఉపసర్పంచ్‌ పల్లె గోపాల్‌ గౌడ్‌కు చెందినట్లు అధికారులు గుర్తించారు. అయితే, గోపాల్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అనుచరుడు అని ప్రతిపక్షపార్టీలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో ఖర్చుచేయడానికే సొమ్మును తరలిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios