సారాంశం

Telangana Election Results: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ కు స‌ర్వం సిద్ద‌మైంది. గురువారం పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా, ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. దీనిని దృష్టిలో ఓట‌ర్లు అంద‌రూ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని ఎన్నిక‌ల సంఘం పేర్కొంది.
 

Telangana Assembly Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు తుదిద‌శ‌కు చేరుకున్నాయి. మూడు ప్ర‌ధాన పార్టీలైన భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్), భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ ల మ‌ధ్య త్రిముఖ పోరు ఉంటుంద‌ని భావిస్తున్నారు. గురువారం పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా, ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. అయితే, రాష్ట్రంలోని వివిధ నియోజ‌క వ‌ర్గాల్లో ఓట‌ర్ల వివ‌రాల‌ను గ‌మ‌నిస్తే శేరిలింగం ప‌ల్లిలో అత్య‌ధిక ఓట‌ర్లు ఉండ‌గా, అత్య‌ల్పంగా భ‌ద్రాచ‌లంలో ఉన్నారు. 

తెలంగాణ‌లో అత్య‌ధిక ఓట‌ర్లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు: 

1. శేరిలింగంప‌ల్లి - 6,98,133

2. కుత్బుల్లాపూర్ - 6,69,361

3. మేడ్చ‌ల్ - 5,95,536

4. ఎల్బీ న‌గ‌ర్ - 5.66,866

5. రాజేంద్ర న‌గ‌ర్ - 5,52,455

6. మ‌హేశ్వ‌రం - 5,17,316

7. ఉప్ప‌ల్ - 5,10,345

8. మ‌ల్కాజ్ గిరి - 4,69,078

9. కూక‌ట్ ప‌ల్లి - 4,47,575

తెలంగాణ‌లో అత్య‌ల్ప‌ ఓట‌ర్లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు: 

1. భ‌ద్రాచ‌లం-1,46,016

2. అశ్వ‌రావుపేట - 1,53,080

3. బెల్లంప‌ల్లి - 1,69,759

4. చెన్నూరు - 1,84,250

5. వైరా - 1,90,950

6. బాన్సువాడ - 1,93,032

7. పిన‌పా - 1,94,145

8. దుబ్బాక - 1,94,722

9. జుక్క‌ల్ - 1,98,035