జీహెచ్ఎంసీలో వరదసాయానికి బ్రేక్ పడింది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి కోడ్ ఆఫ్ కాండాక్ట్ రావడంతో వరద సాయం నిలిచిపోయింది. ఎన్నికల ఫలితాల తర్వాత యధావిధిగా పథకం అమలవుతుందని ఈసీ తెలిపింది.

వరద సాయం కోసం దరఖాస్తుల స్వీకరణ, పంపిణీ నిలిపివేయాలని ఎన్నికల సంఘం పేర్కొంది. మరోవైపు హైదరాబాద్ లో వరద సాయం నేరుగా బాధితుల అకౌంట్లోనే వేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ సూచించింది.

నిబంధనల మేరకే బాధితులకు సాయం అందించాలని చెప్పింది.  నిన్న ఒక్కరోజే రూ. 55 కోట్ల లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం జమచేసిందని..సాయం అందని వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవచ్చని చెప్పింది.

Also Read:జీహెచ్ఎంసీ ఎన్నికలు: మంత్రులు, నేతల లాబీయింగ్‌.. కేటీఆర్‌కు తలనొప్పులు

ఇప్పటి వరకు బాధితులకు రూ. 10 వేలు చేతికి అందించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నేరుగా అకౌంట్లో వేయాలని చెప్పింది. హైదరాబాద్ లోని పలు ఏరియాల్లో వరద బాధితులు కొన్ని రోజులగా మీ సేవా కేంద్రాల ముందు క్యూలు కడుతున్నారు.  

వరద సాయం అప్లై చేసుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే లైన్ కడుతున్నారు. దీంతో గంటల తరబడి లైన్లో నిలబడలేక జనం అవస్థలు పడుతున్నారు.  బీపీ,షుగర్  పేషెంట్లు సొమ్మసిల్లి పడిపోతున్నారు . కరోనా సమయంలో వేసినట్లు డబ్బులు అకౌంట్లో వేయాలని కోరుతున్నారు.