Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ సర్కార్‌పై ఈసీ ఆగ్రహం.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనం పెంపుకు మళ్లీ బ్రేక్..

తెలంగాణ ప్రభుత్వాధికారులపై ఈసీ (election commission) ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్, మున్సిపల్ శాఖ స్పెషల్ సెక్రటరీపై సీరియస్ అయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ (mlc elections code) అమల్లో వుండగా.. స్థానిక సంస్థల నేతల జీతాలను (honorarium) పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

election commission serious on telangana govt over local body leaders salaries hike
Author
Hyderabad, First Published Dec 7, 2021, 6:43 PM IST

తెలంగాణ ప్రభుత్వాధికారులపై ఈసీ (election commission) ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్, మున్సిపల్ శాఖ స్పెషల్ సెక్రటరీపై సీరియస్ అయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ (mlc elections code) అమల్లో వుండగా.. స్థానిక సంస్థల నేతల జీతాలను (honorarium) పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రెండు రోజుల్లోనే జీవోను వెనక్కి తీసుకుంది ప్రభుత్వం. 

గత ఆదేశాల ప్రకారం.. రాష్ట్రంలోని హైదరాబాద్‌ సహా ఇతర నగరపాలక సంస్థల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, పురపాలక ఛైర్‌పర్సన్లు, కౌన్సిలర్లకు, కోఆప్షన్‌ సభ్యులకు రవాణా భత్యంతో పాటు గౌరవ వేతనాలు 30 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. మేయర్ల నెలసరి వేతనం రూ.50 వేల నుంచి రూ.65 వేలకు, డిప్యూటీ మేయర్ల వేతనం రూ.25 వేల నుంచి రూ.32500కి, కార్పొరేటర్లకు రూ.6000 నుంచి రూ.7800కి పెంచింది. 

ALso Read:తెలంగాణ : స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంపు నిర్ణయం వెనక్కి.. కారణమిదే

50 వేల జనాభా దాటిన పురపాలక సంఘాల్లో ఛైర్‌పర్సన్లకు రూ.15000 నుంచి రూ.19500, వైస్ ఛైర్‌పర్సన్లకు రూ.7500 నుంచి రూ.9750, కౌన్సిలర్లకు రూ.3500 నుంచి రూ.4550కి పెరగనున్నాయి. అలాగే 50 వేల కంటే తక్కువ జనాభా గల మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్లకు రూ.12000 నుంచి రూ.15600, వైస్ ఛైర్‌పర్సన్లకు రూ.5000 నుంచి రూ.6500, కౌన్సిలర్లకు రూ.2500 నుంచి 3250 రూపాయల చొప్పున జులై నుంచి వేతనాలను పెంచాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజాగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం మరో ఉత్తర్వు జారీ చేసింది. 

కాగా... ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల టీఆర్‌ఎస్ (trs) పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గుత్తా సుఖేందర్ రెడ్డి,  కడియం శ్రీహరి, తక్కళపల్లి రవీంద్రరావు, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, బండ ప్రకాష్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. త్వరలోనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌ నగర్, కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాల చొప్పున, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios