బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు చేయాలని… తెలంగాణ ఎన్నికల కమీషన్‌ను (telangana election commission) ఆదేశించింది కేంద్ర ఎన్నికల కమీషన్. యూపీ ఎన్నికల పోలింగ్‌కు 72 గంటల ముందు ప్రచారం నిర్వహించొద్దని… ఇంటర్వ్యూలు కూడా ఇవ్వద్దని రాజాసింగ్‌ని ఆదేశించింది.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు (raja singh) ఎన్నికల కమీషన్ (election commission) షాక్ ఇచ్చింది. యూపీ ఎన్నికల (up election 2022) ప్రచారం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. వీటిని సీరియస్‌గా తీసుకున్న ఈసీ.. రాజాసింగ్‌పై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా రాజాసింగ్‌పై కేసు నమోదు చేయాలని… తెలంగాణ ఎన్నికల కమీషన్‌ను (telangana election commission) ఆదేశించింది. ఎన్నికల పోలింగ్‌కు 72 గంటల ముందు ప్రచారం నిర్వహించొద్దని… ఇంటర్వ్యూలు కూడా ఇవ్వద్దని రాజాసింగ్‌ని ఆదేశించింది.
కాగా.. కొద్దిరోజుల క్రితం యూపీ ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చిన రాజాసింగ్... యోగి ఆదిత్యనాథ్ కు (yogi adityanath) ఓటు వేయకుంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు రాజాసింగ్ మంగళవారం వీడియో విడుదల చేశారు. మంగళవారం జరిగిన రెండో విడత పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల అత్యధిక పోలింగ్ జరిగింది అని పేర్కొంటూ... యోగిని వ్యతిరేకిస్తున్న వారే ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేసి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. మూడో దశ పోలింగ్ లో హిందువులంతా బయటకు రావాలని పిలుపునిచ్చారు.
దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. యూపీలో ఓటర్లను బెదిరిస్తూ రాజాసింగ్ బాహాటంగా వ్యాఖ్యలు చేశారని, అందుకు ఆయనను తక్షణం అరెస్టు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సీఎం కేసీఆర్, రాజాసింగ్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని.. ఈసీ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది.
అయితే ఈసీ నోటీసులపై రాజాసింగ్ స్పందించారు. అఖిలేష్ ప్రభుత్వంలో మాఫియా రాజ్యం నడిచిందని.. యోగి ప్రభుత్వం వచ్చాక మాఫియాను బుల్డోజర్‌ను ఎత్తిపడేశారని రాజాసింగ్ అన్నారు. ఆ ఉద్దేశంతోనే తాను బుల్డోజర్ వ్యాఖ్యలు చేశానని ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై కొందరు కుట్ర చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. యోగి ఆదిత్యనాథ్ మరోసారి సీఎం కాకూడదనే ఉద్దేశంతో కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు. యోగికి మద్ధతుగా వుండకుంటే మరోసారి హిందువులపై దాడులు జరుగుతాయని రాజాసింగ్ ఆరోపించారు.
