తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల:రెండు స్థానాలకు పోలింగ్
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది ఎన్నికల సంఘం.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేసింది. ఎన్నికల సంఘం. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు రాజీనామాలు చేయడంతో ఎన్నిక నిర్వహించడం అనివార్యంగా మారింది.
స్టేషన్ ఘన్ పూర్ నుండి కడియం శ్రీహరి, హుజూరాబాద్ నుండి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామాలు చేశారు. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల కానుంది.ఈ నెల 29న పోలింగ్ నిర్వహించనున్నారు.
ఈ నెల 11 వ తేదీ నుండి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు చివరి తేది.ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 22న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఈ నెల 22న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత అదే రోజున సాయంత్రం ఐదు గంటల నుండి ఓట్లను లెక్కిస్తారు. ఈ ఇద్దరు ఎమ్మెల్సీలకు 2027 నవంబర్ 30వ తేదీ వరకు పదవీ కాలం ఉంటుంది.
స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ స్థానం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్థానంలో కడియం శ్రీహరికి భారత రాష్ట్ర సమితి టిక్కెట్టు కేటాయించింది. హుజూరాబాద్ లో ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు భారత రాష్ట్ర సమితి టిక్కెట్టు కేటాయించింది. అయితే 2023 నవంబర్ 30 న జరిగిన పోలింగ్ లో పాడి కౌశిక్ రెడ్డికి బీఆర్ఎస్ టిక్కెట్టు కేటాయించింది. కౌశిక్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి హుజూరాబాద్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అయితే గత ఏడాది నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో హుజూరాబాద్ నుండి కౌశిక్ రెడ్డి విజయం సాధించారు.