జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు రూ62.21 లక్షల నగదును సీజ్ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రకటించింది. 2,393 మందిపై బైండోవర్, 148 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు వెల్లడించింది.

11 ఘటనలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఈసీ ప్రకటించింది. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలు సంబంధించి నామినేషన్ల గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో గడువు ముగిసే సమయానికి రిటర్నింగ్ కార్యాలయంలో వున్న వారికి నామినేషన్లు వేసేందుకు ఛాన్స్‌లు ఇచ్చారు అధికారులు.

మూడు గంటల లోపే నామినేషన్లు వేయాల్సిన ఆవశ్యకత వుంది. కానీ భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఇంకా 69 డివిజన్లలో అభ్యర్ధులను ప్రకటించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ.

Also Read:వాళ్లూ మా బిడ్డలే.. సెటిలర్లకు సీట్లు కేటాయించాం: కేటీఆర్

అటు భారతీయ జనతా పార్టీ 150 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించినప్పటికీ అధికారికంగా కేవలం 128 మంది అభ్యర్ధుల జాబితాను మాత్రమే ప్రకటించింది. అదే విధంగా మరొక 22 మందికి సంబంధించిన డివిజన్లకు సంబంధించిన అభ్యర్ధులను అధికారికంగా ప్రకటించాల్సి వుంది.

అయితే టీఆర్ఎస్ మొత్తం 150 డివిజిన్లకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఇందులో మొత్తం 26 మంది సిట్టింగ్ కార్పొరేటర్ కి ఛాన్స్ దక్కలేదు. మూడవ జాబితాలో 16 మంది సిట్టింగ్ లకు సీటు దక్కలేదు.